ZEE News Network: జీ తెలుగు న్యూస్ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ జీ అవార్డ్స్ - 2025..

ZEE News Network: జీ న్యూస్.. ప్యాన్ ఇండియా న్యూస్ నెట్ వర్క్. 18 వార్తా ఛానళ్లతో దేశంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో జీ స్క్రీన్ పై కనిపిస్తుంది. గంట గంటకు బ్రేకింగ్ న్యూస్, వార్తాంశాలపై ప్రత్యేక కథనాలు, ప్రపంచ పరిణామాలపై లోతైన విశ్లేషణలు.. జీ నెట్ వర్క్ ఎక్స్ క్లూజివ్ గా అందిస్తోంది. తాజాగా తెలుగు న్యూస్ అహోరాత్రులు శ్రమిస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసులకు అవార్డులను ముఖ్యమంత్రి చేతులు మీదుగా ఈ నెల 5 అందించనుంది. 

Written by - TA Kiran Kumar | Last Updated : May 3, 2025, 10:20 PM IST
ZEE News Network: జీ తెలుగు న్యూస్ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ జీ అవార్డ్స్ - 2025..

ZEE News Network: ఈ నేపథ్యంలో జీ తెలుగు న్యూస్ తాజాగా రేయింపగళ్లు కష్టపడుతున్న రక్షణ భటుల సేవలను గుర్తించి వారికి అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి భుజాన వేసుకుంది. ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పోలీసులకు అవార్డులను మే 5వ తేదిన అందించనున్నారు.  ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ కే. రామకృష్ణ రావుతో పాటు.. స్పెషల్ ఛీప్ సెక్రటరీ రవిగుప్తా.. రాష్ట్ర  డీజీపీ డాక్టర్ జితేందర్, హైదరాబాద్ నగర కొత్వాల్ సీవీ ఆనంద్ హాజరు కానున్నారు.  ఈ కార్యక్రమం హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం కానుంది.

Add Zee News as a Preferred Source

ఈ కార్యక్రమానికి జీ తెలుగు న్యూస్ ఏపీ, తెలంగాణ స్టేట్ డైరెక్టర్ ఉమేష్ షరాఫ్ .. జీ తెలుగు న్యూస్ ఛీఫ్ ఎడిటర్ ఎస్. భరత్ కుమార్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు.  జీ తెలుగు న్యూస్ విషయానికొస్తే.. జీ నెట్ వర్క్ లో భాగంగా  మూడేళ్ల కిందట పురుడుపోసుకుంది. లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే సంచలన ప్రసారాలతో మీడియాలో బజ్ క్రియేట్ చేసింది. 2022 జనవరి 25న భరత్ కుమార్ సారథ్యంలో తక్కువ మంది సిబ్బందితో డిజిటల్ మీడియాగా ఎంటరైన జీ తెలుగు న్యూస్.. సరికొత్త ట్రెండ్ తో శాటిలైట్ మీడియాలో సంచలనాలకు కేరాఫ్ గా నిలిచింది. డిజిటల్ మీడియాలో ప్రభంజనం స్పష్టించి మీడియా టైకూన్లను ముక్కున వేలేసుకునేలా చేసింది.

సమాచారం, వాస్తవం ఈ రెండింటినే నమ్ముకున్న జీ తెలుగు న్యూస్.. డిజిటల్ మీడియాలో రికార్డులు బద్దలు కొడుతోంది. 2025 ఏప్రిల్ నెలలో తెలుగులో అగ్రగాములుగా చెప్పుకుంటున్న మీడియా సంస్థలకు దిమ్మతిరిగే రేటింగ్ తెచ్చుకుంది. ఏప్రిల్ లో  43 కోట్ల వ్యూస్ తో తెలుగు డిజిటల్ మీడియాలోనే నంబర్ వన్ గా నిలిచింది. ఏ తెలుగు ఛానల్ కు సాధ్యం కాని రీతిలో ఒకే నెలలో అత్యధికంగా లక్ష 60వేల సబ్ స్క్రైబర్లను దక్కించుకుంది.

భారీ భవంతులు లేవు.. ఓబీ, లైవ్ వ్యాన్లు లేవు.. పీసీఆర్, ఎంసీఆర్, ఇంజెస్ట్, ఐటీ.. ఇలా రకరకాల ఖరీదైన ఎక్విప్ మెంట్ లేదు. కంటెంట్ ను మాత్రమే నమ్ముకున్న జీ తెలుగు న్యూస్.. సక్సెస్ ఫుల్ కటౌట్ కు మారుపేరుగా నిలబడింది. నేటితరం వీక్షకుల నాడిని పట్టుకుంది. వ్యూయర్ కు అవసరమైన విశ్లేషణాత్మక కథనాలను అందిస్తూ కాంపిటీటర్లకు కళ్లు చెదిరే ఎత్తులో నిలబడింది. తెలుగు మీడియాను దశాబ్దాలుగా ఏలుతున్న మీడియా హౌజ్ లకు షార్ట్ కట్ లో సక్సెస్ రుచిని చూపించింది. నిజం నిక్కచ్చిగా.. నిజం నిర్భయంగా చెప్పే ఇదే ఒరవడి ఇకపైనా కొనసాగుతుందని వీక్షకులకు మాటిస్తున్నాం.  

ఇక జీ మీడియా విషయానికొస్తే..
మీడియా ఛత్రపతి సుభాష్ చంద్ర సారథ్యంలో.. డైనమిక్ సీఈఓ కరణ్ అభిషేక్ సింఘ్ ఆధ్వర్యంలో.. జీ మీడియా తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వార్త.. వినోదం.. అందించే తీరులో జీ నెట్ వర్క్ ఎవరికీ సాధ్యంకాని అరుదైన ఘనతలు సాధిస్తోంది. నేడు లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ప్రైవేటు శాటిలైట్, డిజిటల్ మీడియా రంగాన్ని 90 ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లు, 18 వార్తా ఛానెళ్లతో జీ నెట్ వర్క్ శాసిస్తోంది. జీ నెట్ వర్క్ ప్రసారాలు 174 దేశాలకు విస్తరించాయి. 130 కోట్ల మంది ప్రజలు జీ తెలుగు ప్రసారాలను తమ ఇళ్లలో, ఫోన్లలో, స్మార్ట్ టీవీల్లో నిరంతరం వీక్షిస్తున్నారు.

మేం మెట్రో నాడి పడతాం.. పల్లెటూరి వాయిస్ వినిపిస్తాం.. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు.. కచ్ నుంచి కటక్.. వరకు.. అమృత్ సర్ నుంచి అనకాపల్లి వరకు.. మహారాష్ట్ర నుంచి మణిపూర్ వరకు.. అణువణువునా జీ న్యూస్ నెట్ వర్క్ ప్రేక్షకులకు వినోదంతో పాటు విజ్ఞానంతో పాటు నిరంతర వార్త ప్రసారాలను అందిస్తోంది.

జీ న్యూస్
వియోన్
జీ బిజినెస్
జీ భారత్
సలాం టీవీ
జీ రాజస్థాన్
జీ 24 ఘంటా
జీ మధ్యప్రదేశ్- ఛత్తీస్ గఢ్
జీ పంజాబ్ - హర్యానా- హిమాచల్
జీ ఉత్తర్ ప్రదేశ్ - ఉత్తరాఖండ్
జీ బిహార్ - ఝార్ఖండ్
జీ 24 తాస్ (మరాఠీ)
జీ 24 కలక్ (గుజరాత్)
జీ ఢిల్లీ NCR
జీ తెలుగు న్యూస్
జీ కన్నడ న్యూస్
జీ తమిళ్ న్యూస్
జీ మలయాళం న్యూస్

భూమి సమస్యలైనా.. భూకంపం వచ్చినా..  
చినుకు పడినా.. కార్చిచ్చు కాల్చేసినా..
మేం బాధితుల పక్షం..
క్షణాల్లో మా నెట్ వర్క్ లో ప్రసారం  
ఇది మా స్ట్రెంత్.

సుభాష్ చంద్ర. భారతీయ మీడియా ప్రపంచంలోనే ఓ దిగ్గజం. ఈ పేరు భారత దేశ మీడియా చరిత్రలోనే ఓ బ్రాండ్. మారుతున్న ట్రెండ్ ను ముందే పసిగట్టడంలో సుభాష్ చంద్ర దిట్ట. టెక్నాలజీ అందుబాటులోకి రాని జమానాలో, దూరదర్శన్ రోజుల్లోనే సుభాష్ చంద్ర ప్రైవేటు శాటిలైట్ ఛానల్ ఆలోచన చేశారు. శాటిలైట్ ప్రసారాలను ఇంటింటికీ చేర్చేలా కేబుల్ వ్యవస్థను తీసుకొచ్చారు.

మూడున్నర లక్షల రూపాయల అప్పుల్లో ఉన్న తన కుటుంబ బాధ్యతను సుభాష్ చంద్ర తన భుజానికెత్తుకున్నారు. పదిహేనేళ్ల ప్రాయంలో చదువును మధ్యలోనే ఆపేశారు. కుటుంబం కోసం సుభాష్ చంద్ర 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి బయటకు వెళ్లి ధాన్యం కొనుగోలు వ్యాపారంలోకి దిగారు. 1980లలో ఎస్సెల్ ప్యాకేజింగ్ సంస్థ నెలకొల్పారు. 1981లో మొదటిసారిగా ట్యూబ్ లైట్లు తయారుచేసే ఎస్సెల్ ప్రో-ప్యాక్ కంపెనీని ప్రారంభించారు. 1989లో ఆసియాలోనే అతిపెద్ద థీమ్ వాటర్ పార్క్ వాటర్ కింగ్ డమ్ ను స్థాపించారు. దూరదర్శన్ మాత్రమే ఉన్న ఆ రోజుల్లో జనానికి వినోదం, సమాచారం  అందించడం కోసం ఓ ప్రైవేటు శాటిలైట్ ఛానల్ ఎందుకు ఉండకూడదని ఆలోచించారు. భారత్ లో ఆ సమయానికి అప్ లింకింగ్ సౌకర్యం కూడా లేదు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే ప్రసారాలు ఉండేవి. అందుబాటులో టెక్నాలజీ లేకపోయినా వ్యయ ప్రయాసలకు ఓర్చి, దేశంలోనే మొట్టమొదటి ప్రైవేటు శాటిలైట్ ఛానల్ జీ టీవీని సుభాష్ చంద్ర 1992లో ప్రారంభించారు.

ఆ తర్వాత శాటిలైట్ టీవీ ప్రసారాలను ఇంటింటికీ చేర్చే ఉద్దేశంతో 1994లో సిటీ కేబుల్ నెట్ వర్క్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఏర్పాటుచేశారు. భారతీయ మీడియా రంగంలో జీ టీవీ వేసిన అడుగులు ఎందరికో స్ఫూర్తిదాయకం. ముళ్లదారిలో నడిచి సమాచార సువర్ణాధ్యాయం లిఖించింది. ఎవరికీ సాధ్యంకాని అరుదైన ఘనతలు సాధించింది. తన రికార్డులను తానే చెరిపేసుకుని మీడియా రంగాన్ని కొత్త ఎత్తులకు చేర్చింది.

భారతీయ మీడియాలో జీ టీవీ రాక పెను సంచలనం. రేడియో, డీడీ మాత్రమే తెలిసిన భారతీయులు జీ టీవీ రాకతో సమాచారాన్ని వేగంగా, మరింత విశ్లేషణాత్మకంగా తెలుసుకునే వీలు కలిగింది. వార్తలే కాదు.. విశ్లేషణలు..వ్యాఖ్యానాలు.. వినోదం.. ఇలా జనాన్ని టీవీలకు అతుక్కుపోయేలా చేయడంలో జీ టీవీ చరిత్రాత్మక ముద్ర వేసిందనడంలో అతిశయోక్తి లేదు.

ప్రపంచవ్యాప్తంగా మీడియా రంగంలో వస్తున్న మార్పులు, ట్రెండ్ ను అద్భుతంగా అంచనా వేసిన సుభాష్ చంద్ర మీడియా బ్యారన్ అనిపించుకున్నారు. ఎవరూ సాహసించని రీతిలో అద్భుతాలు ఆవిష్కరించారు. వైర్ లెస్ సెటాప్ బాక్స్ లలో టీవీ ప్రసారాల అవసరం గుర్తించిన ఈ మీడియా దిగ్గజం.. 2003లోనే మొట్టమొదటి డైరెక్ట్ టు హోమ్- DTH డిష్ టీవీని ప్రారంభించారు. డీటీహెచ్ రంగంలో డిష్ టీవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలుది కాదు. జీ బాటలోనే అనేక కార్పొరేట్ కంపెనీలు డీటీహెచ్ రంగంలోకి అడుగుపెట్టాయి.డిష్ టీవీ, వీడియో కాన్ రెండూ సుభాష్ చంద్ర సారథ్యంలోనే నడుస్తున్నాయి.

ఇండియాస్ ఫస్ట్ ఓటీటీ కూడా జీ కుటుంబం నుంచి వచ్చిందే. ఓటీటీ ఇప్పుడు వినోద రంగాన్ని శాసిస్తోంది. 2018లోనే మొట్టమొదటి ఓవర్ ది టాప్ ప్లాట్ ఫామ్ "జీ5" ప్రారంభమైంది. కరోనా తర్వాత ఓటీటీలకు ఆదరణ పెరగడంతో జీ చూపిన మార్గాన్నే ప్రముఖ కార్పొరేట్ కంపెనీలను అనుసరించాయి. ఇలా.. శాటిలైట్.. కేబుల్ టీవీ.. సోషల్ మీడియా..వెబ్..అన్నింటా తనదైన ముద్ర వేసింది జీ నెట్ వర్క్. దూరదర్శన్ రోజుల నుంచే సమాచార విప్లవం తీసుకొచ్చిన జీ నెట్ వర్క్..ఇప్పటికీ న్యూస్ మీడియాలో అగ్రగామిగా నిలిచింది. ప్రస్తుతం జీ న్యూస్ ఆధ్వర్యంలోనీ జీ తెలుగు న్యూస్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో బుల్లెట్ వేగంతో రాకెట్ వేగంతో తెలుగు మీడియాలో  దూసుకుపోతుంది.

ఇదీ చదవండి:  కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !

ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News