)
ZEE Telugu Achievers Awards: జీ తెలుగు నెట్ వర్క్ న్యూస్ నుంచి ఎంటర్టైన్మెంట్, ఓటీటీ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న వంద శాతం స్వదేశీ మీడియా. ఈ ఛానెల్ వ్యవస్థాపకుడైన సుభాష్ చందర్ ఆధ్వర్యంలో మన దేశంలో తొలి ప్రైవేట్ శాటిలైట్ ఛానెల్ గా ప్రారంభమై అంచలంచెలుగా న్యూస్ సహా అన్ని మీడియా రంగాల్లో అగ్ర స్థానంలో నిలిచింది. జీ నెట్ వర్క్ లోని తెలుగు న్యూస్ ఛానెల్..జీ నెట్ వర్క్ లో భాగంగా మూడున్నరేళ్ల కిందట మొదలైంది. స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లోనే ఇంతింతై అన్నట్టు సంచలన వార్త ప్రసారాలతో మీడియాలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2022 జనవరి 25న భరత్ కుమార్ సారథ్యంలో తక్కువ మంది సిబ్బందితో డిజిటల్ మీడియాగా ఎంట్రీ ఇచ్చింది జీ తెలుగు న్యూస్.. సరికొత్త ట్రెండ్ తో శాటిలైట్ మీడియాలో సంచలనాలకు మారుపేరుగా నిలిచింది. డిజిటల్ మీడియాలో ప్రభంజనం స్పష్టించి మీడియా టైకూన్లను సైతం నివ్వెర పోయేలా చేస్తోంది.
ఇప్పటికే జీ తెలుగు న్యూస్ వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరించిన వాళ్లకు పలు మార్లు అవార్డులు ప్రధానం చేసింది. రీసెంట్ గా పోలీస్ వాళ్ల సేవలను గుర్తించి వారికి అవార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు మీదుగా ప్రధానం చేసింది.తాజాగా జీ తెలుగు న్యూస్ నెట్ వర్క్ జీ అచీవర్స్ అవార్డ్స్ పేరుతో సమాజంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరించిన వారికి మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు చేతులు మీదుగా ఈ రోజు 4 గంటలకు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న జల విహార్ లో అవార్డు గ్రహీతలకు అవార్డులు ప్రధానం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి శ్రీ వెంకయ్య నాయుడుతో పాటు తెలంగాణ ఐటీ మినిష్టర్ శ్రీ శ్రీధర్ బాబు.. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు, .. మల్కాజ్ గిరి ఎంపీ బీజేపీ నేత శ్రీ ఈటల రాజేందర్, ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ హరీష్ శంకర్ ప్త్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో పాటు .. ప్రముఖ సామాజిక సేవకుడు మంద కృష్ణ మాదిగ, సినీ నటుడు, రచయత, దర్శకుడు తనికెళ్ల భరణి లను జీవన సాఫల్య పురస్కారాలతో సత్కరించనున్నారు. అటు యంగ్ అచీవర్స్ లో భాగంగా .. ప్రముఖ క్రికెటర్ నితిష్ కుమార్, ఎవరెస్ట్ శిఖరాన్ని అతిపిన్న వయసులో అధిరోహించిన మాలవత్ పూర్ణతో పాటు ప్రముఖ జానపద, సినీ గాయని మంగ్లీని సన్మానించనున్నారు.
అటు జీ తెలుగు న్యూస్ ఐకాన్ ఆప్ ఎక్స్ లెన్స్ క్యాటగిరి విభాగంలో MEIL గ్రూపు డైరెక్టర్ సుధారెడ్డి కి అవార్డు ప్రధానం చేయనున్నారు. అటు దేశం కోసం తన ప్రాణాలను ఒదిలిన ప్రముఖ సైనికుడు మురళి నాయక్ కుటుంబాన్ని స్పెషల్ రికగ్నజేషన్ విభాగంలో వారి తల్లిదండ్రులకు జీ తెలుగు న్యూస్ గ్రూపు అవార్డులను ప్రధానం చేయనుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఈ కార్యక్రమంలో హైదరాబాద్ లోని జలవిహార్ లో ఈ కార్యక్రమం జరగనుంది. వీరితో పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 40 మందికి అవార్డులు ప్రధానం చేయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.