Zomato Rider Falls : 'ప్రాణం కంటే లాభాలే ముఖ్యమా?'.. భారీ వర్షానికి ఓపెన్‌ డ్రెయిన్‌లో పడిపోయిన జొమాటో రైడర్‌, వీడియో వైరల్‌..

Hyderabad Zomato Rider Falls Video : భారీ వర్షానికి అల్లాడి పోతుంది హైదరాబాద్. వారం రోజులుగా వర్షం కురుస్తుంది సాయంత్రం అవ్వగానే వర్ష బీభత్సంతో అందరూ చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జొమాటో రైడర్ కూడా పీకల్లోతు నీటి గుంతలో పడిపోయారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Aug 11, 2025, 11:29 AM IST
Zomato Rider Falls : 'ప్రాణం కంటే లాభాలే ముఖ్యమా?'.. భారీ వర్షానికి ఓపెన్‌ డ్రెయిన్‌లో పడిపోయిన జొమాటో రైడర్‌, వీడియో వైరల్‌..

Hyderabad Zomato Rider Falls Video : ఓ జొమాటో డెలివరీ రైడర్‌ భారీ వర్షం ధాటికి అదుపుతప్పి ఓ ఓపెన్ డ్రెయిన్‌లో పడిపోయాడు. తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ ఘటన శనివారం హైదరాబాద్ ఎల్బీనగర్లో చోటుచేసుకుంది. వారం రోజులుగా భారీ వర్షాలు హైదరాబాద్ ని అతలాకుతలం చేస్తున్నాయి. సాయంత్రం అయిందంటే చాలు భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించుతున్నాయి. రాత్రంతా వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జమమయమైపోవడం, రోడ్లన్నీ చెరువులను తలపించడం బయటికి వెళ్లినవారు ఇళ్లకు చేరాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ కూడా భారీగా పెరిగిపోతుంది.

Add Zee News as a Preferred Source

అయితే హైదరాబాద్ జొమాటో రైడర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఓపెన్ డ్రెయిన్‌లో వర్షం ధాటికి అదుపు తప్పి పడిపోయాడు. పీకల్లోతు నీళ్లలో కొద్దిపాటిలో స్థానికులు అతడిని కాపాడారు. సయ్యద్ ఫరహాన్ అనే జొమాటో రైడర్ కి శనివారం ఈ చేదు ఘటన ఎదురైంది. కొద్దిపాటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఫోన్ పోగొట్టుకోవడంతో పాటు మోటార్ సైకిల్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇది యాక్సిడెంటల్ కాదు ఈ ప్లాట్‌ఫారమ్స్‌ కేవలం లాభాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. వర్కర్ల సేఫ్టీని ఏ విధంగాను పట్టించుకోవడంలేదని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫారం వర్కర్స్ యూనియన్ ఇలాంటి ఘటనే రేపు మరి ఎవరికైనా జరగవచ్చు అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇలాంటి సమయంలో ఎలాంటి అనుకొని ప్రమాదాలు జరిగితే జోమాటో బాధ్యత వహించాలని ఈ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది . అంతేకాదు వర్షాకాలంలో ఇలా డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఫోన్ డామేజ్ అవుతుంది. వెహికల్ కూడా పాడవుతుంది. కంపెనీ పరిహారం ఇవ్వాలని కోరారు. వర్షాకాలంలో డెలివరీ ఇవ్వడం వల్ల రూ.10 , రూ.15 బోనస్ ఇవ్వడం కాదు.. సదరు వ్యక్తి ప్రాణాలతో ఇంటికి చేరేలా చూడాలి అంటున్నారు.

 

 

ఇలాంటి విపత్కర సమయంలో రైడర్స్ ను డెలివరీలకు పంపించకండి. ఎప్పటికప్పుడు వాతావరణం అప్డేడ్‌ కూడా రైడర్స్ కి ముందస్తుగా అలర్ట్ చేయాలని కోరారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అంటే సరైన బోనస్ కూడా వారికి అందించాలని అన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా తగిన చర్యలు తీసుకోవాలని డెలివరీ రైడర్ల ప్రాణాలు రిస్క్ లో పడకుండా కాపాడాలన్నారు. జిహెచ్ఎంసి ఇప్పటికే ఎన్నోమార్లు వర్షం పడ్డ సమయంలో బయటకు రాకూడదని అలర్ట్ జారీ చేసినా కానీ వారి హెచ్చరికలను పట్టించుకోవట్లేదు అని యూనియన్‌ చెబుతోంది. ఇంకా దీనిపై జొమాటో స్పందించాల్సి ఉంది.

ఇదీ చదవండి: India Vs US: అమెరికాకు బిగ్‌ షాకిచ్చిన భారత్‌.. $3.6 బిలియన్ల డీల్‌ సస్పెండ్‌..!

ఇదీ చదవండి:  భారత్‌- రష్యా- చైనా కలవనున్నాయా? ఉమ్మడిగా యూఎస్‌పై బ్రిక్స్‌ దేశాలు పోరాడతాయా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

...Read More

Trending News