Tirumala: తిరుమల ఆలయానికి అనూహ్య కానుక.. 12 లారీల ఎండుగడ్డి ఇచ్చిన ఎమ్మెల్యే

Big Surprise Gift To Tirumala Temple 12 Lorry's Grass Donated By TDP MLA: తిరుమల ఆలయానికి అనూహ్య కానుక అందింది. ఇలాంటి కానుక కూడా ఇస్తారా? అనే సందేహాం రాకుండా ఉండదు. తిరుమల ఆలయానికి 12 లారీల ఎండుగడ్డిని ఒకరు దానం చేశారు. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 12, 2025, 04:11 PM IST
Tirumala: తిరుమల ఆలయానికి అనూహ్య కానుక.. 12 లారీల ఎండుగడ్డి ఇచ్చిన ఎమ్మెల్యే

Tirumala Temple Donation: కలియుగ వైకుంఠవాసుడికి కానుకల వెల్లువ కొనసాగుతోంది. ధన, స్వర్ణ, రజత, రత్న కానుకలతోపాటు వస్తూ రూపేణ తిరుమల ఆలయానికి విరాళాలు వస్తున్నాయి. ఈ క్రమంలో విచిత్రంగా.. ఇలాంటి కానుక కూడా ఇవ్వవచ్చా? అనేలా తిరుమలకు విరాళం వచ్చింది. తిరుమల శ్రీవారికి ఎండుగడ్డిని ఓ రాజకీయ నాయకుడు విరాళంగా ఇవ్వడం విశేషం. అది కూడా బండి.. ట్రాక్టర్‌ కాదు లారీలకు లారీల్లో ఎండుగడ్డిని తిరుమలకు అప్పగించారు. ఇంతకీ ఆ విరాళం ఎవరు ఇచ్చారు? ఎండుగడ్డితో తిరుమలలో ఏం చేస్తారనేది తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

Also Read: Govt Employees: ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌.. టేక్‌ హోం శాలరీపై కీలక ప్రకటన

జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. టీటీడీ సేవలో నిత్యం నిమగ్నమయ్యే అతడు తిరుమలకు అరుదైన కానుక ఇచ్చాడు. 12 లారీల ఎండుగడ్డిని ఆలయానికి విరాళంగా ఇచ్చారు. అయితే ఇచ్చిన విరాళం ఆలయానికి కాకుండా టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గో సంరక్షణ శాలకు అప్పగించారు. గో సేవ కోసం గడ్డిని దానం ఇచ్చారు. టీటీడీ గో సంరక్షణ శాలకు 12 లారీల ఎండుగడ్డిని జ్యోతుల నెహ్రూ, శ్రీనివాస ట్రస్ట్ ఫౌండేషన్ విరాళంగా అందించింది. గతంలో ఎస్వీ గో సంరక్షణ శాలకు 6 లారీల ఎండుగడ్డిని విరాళంగా అందించడం గమనార్హం. మరో 32 లారీల పశుగ్రాసాన్ని కూడా త్వరలోనే అందించునున్నట్లు శ్రీనివాస ట్రస్ట్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. గోశాలలో ఉన్న గోవులకు ఆహారాన్ని తాము నిత్యం అందిస్తున్నట్లు జ్యోతుల నెహ్రూ అనుచరులు తెలిపారు.

Also Read: Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్‌ ఎన్నికల్లో హైలెట్స్‌.. రేవంత్ రెడ్డికి భారీ షాక్

ప్రముఖుల దర్శనం
తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నిర్మాత అశ్వినీదత్, పోర్ట్ మాజీ సీఎండీ కేవీ రావు, ప్రముఖ కథా రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ ఉదయం నైవేద్య విరామంలో శ్రీవారిని వేరువేరుగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. వారితోపాటు తమిళ సినీనటి పావని రెడ్డి, బిగ్‌బాస్ తమిళ సీజన్ 5 కంటెస్టెంట్‌ ప్రియాంక దేశ్‌పాండే ఆలయానికి వచ్చి దర్శనం చేసుకున్నారు. ప్రముఖులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు.

Also Read: New Seeds Bill: కొత్త విత్తన బిల్లుపై బీఆర్‌ఎస్‌ పార్టీ సంచలన ప్రకటన.. కేటీఆర్‌ ఏం చెప్పారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News