)
Tirumala Srivari Brahmotsavam: కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ప్రధాన ఆలయంలో డ్రైఫ్రూట్లు, రోజామాలల అలంకారంతో స్నపనతిరుమంజనం శోభాయమానంగా నిర్వహించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించారు.
బాదం, పిస్తా, కుంకుమపువ్వు, వట్టివేరు, పసుపు కొమ్ములు, ఎండు ద్రాక్ష, యాలకులు, తులసి, రోజామాలలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఉత్సవమూర్తులను అలంకరించారు. వివిధ రంగుల పుష్పాలు, ఫలాలు, సాంబ్రాణి, ధూపదీప నైవేద్యాల నడుమ రంగనాయకుల మండపం నూతనత్వాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు కొబ్బరి నీళ్లు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
వేదపండితులు చతుర్వేదపారాయణం ఆలపించారు. బ్రహ్మోత్సవాల సమయంలో వాహనసేవల్లో తిరువీధుల్లో ఊరేగి అలసిపోయే స్వామివారు స్నపన తిరుమంజనంతో సేద తీరుతారని ఆలయ అర్చకులు తెలిపారు. కంకణభట్టర్ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది.
అధికారుల డ్యాన్స్
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కళాకారులతో కలిసి టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ నృత్యం చేశారు. కోలాటం బృందంతో కలసి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి సందడి చేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలో కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి.
భక్తులు భారీగా..
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా వస్తున్నారు. తిరుమలకి వచ్చిన భక్తులు కల్యాణవేదిక వద్ద ఏర్పాటుచేసిన పుష్ప ఫల ప్రదర్శనకి విశేష స్పందన వస్తుంది. రకరకాల పుష్పాలను ఒక్కే దగ్గర చూస్తూ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పురాణాల ద్రౌపతి స్వయంవరం, భీముడు ఆహారం తీసుకెళ్లే ఘట్టంతోపాటు ఇసుకతో తయారు చేసిన ఆనంద నిలయంపై గరుత్మాంతుడు ప్రతిమలు, పలు రకాల ఘట్టాలను చూస్తున్న భక్తులతో ఆకట్టుకుంటున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook