)
Vibhuti falling from sai baba idol in tirupati: కలియుగ దైవం, భక్తుల కొంగు బంగారమైన శ్రీవెంకటేశ్వరు స్వామి కొలువైన తిరుపతి జిల్లాలో ఇటీవల అనేక వింతైన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. గతంలో తిరుపతిలో స్థానికంగా ఉన్న ఒక శివాలయంలో శివుడి లింగం కళ్లు తెరిచిన ఘటన వార్తలలో నిలిచింది. తిరుపతిలోని గాంధీపురంలో స్థానికంగా ఉన్నరామలింగేశ్వర స్వామి శివాలయంలో పరమశివుడు కళ్ళు తెరిచినట్లుగా శివలింగంలో స్పష్టంగా కన్పించింది.
తిరుపతిలో మహా అద్భుతమైనటువంటి సంఘటన సాయిబాబా విగ్రహం నుంచి విభూది...! pic.twitter.com/QDkfuQxLaL
— Zee Telugu News (@ZeeTeluguLive) September 12, 2025
దీంతో పూజారీ ఈ విషయంను అందరికి చెప్పగా ఈ వింతను చూసేందుకు భక్తులు తండొపతండాలుగా తరలివచ్చారు. ఈ ఘటన మరవక ముందే మరో అద్బుతం చోటు వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని ఒక స్థానికుల ఇంట్లో..పూజ మందిరంలో సాయిబాబా విగ్రహంను పెట్టుకున్నారు. అయితే..ఈ విగ్రహం నుంచి నిన్న రాత్రి నుంచి విభూతి రాలుతుంది. దీంతో కుటుంబ సభ్యులు అంతా ఇది సాయి బాబా మహిమ అంటూ భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నారు.
గత రెండు సంవత్సరాలుగా ఇదే విధంగా సాయిబాబా పటం, విగ్రహం నుంచి విభూతి రాలడం గమనిస్తున్నట్లు సదరు ఇంటి మహిళ వెల్లడించింది. నిన్న రాత్రంతా ఇల్లంతా విభూది సువాసన వెదజల్లడంతో పూజ మందిరం దగ్గరికి వెళ్లి చూడగా.. అక్కడ బాబా విగ్రహం నుంచి విభూతి రాలడంను చూసింది. వెంటనే ఇంట్లో వారికి చుట్టుపక్కలవారికి ఈ విషయంను చెప్పగా.. అందరు కూడా ఎంతో ఆశ్చర్యంతో చూశారు.
గత రెండేళ్లుగా షిర్డీ వెళ్లలేదని సాయిబాబా ఈవిధంగా తమ ఇంట్లోకి వచ్చి తమను ఆశీర్వదించాడని కూడా ఆ కుటుంబం వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా తమ ఇంట్లో అద్బుతం జరగడం ఇది నాలుగోసారి అంటూ కూడా మహిళ భక్తిపారవశ్యంకు గురైంది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook