)
Salakatla Brahmotsavam 2025: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో ఏడాదికోసారి జరిగే బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదలైంది. అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల తేదీలు ఇలా ఉన్నాయి. లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఈ ఉత్సవాల పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఏ రోజు నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి? ఎప్పుడు ముగుస్తాయి? ఏ రోజు ఏ విశిష్ట పూజలు, సేవలు ఉంటాయి? అనేవి తెలుసుకుందాం.
సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగుతాయని టీటీడీ ప్రకటించింది. సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈనెల 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 16వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వాహన సేవలు ఉంటాయి.
వాహన సేవల వివరాలు
24 సాయంత్రం 05.43 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం. రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం
25 ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం. రాత్రి 7 గంటలకు హంస వాహనం
26 ఉదయం 8 గంటలకు సింహ వాహనం. మధ్యాహ్నం 1 గంటకు స్నపనం. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం
27 ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం. మధ్యాహ్నం 1 గంటకు స్నపనం. రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం
28 ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం. సాయంత్రం 6.30 నుంచి రాత్రి గరుడ వాహనం
29 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం. సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం. రాత్రి 7 గంటలకు గజ వాహనం
30 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం
01 ఉదయం 7 గంటలకు రథోత్సవం. రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం
02 ఉదయం 6 నుంచి 9 వరకు చక్రస్నానం. రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.