Anchor Shyamala Comments On AP CM Chandrababu: యాంకర్ శ్యామల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలపై అడుగడుగునా దారుణాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళలు నిర్భయంగా బయటకు వస్తే, ఆయనకు హారతులతో స్వాగతం పలికేవారని శ్యామల గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వ నాయకులు కనీసం మహిళలకు "హాయ్" కూడా చెప్పడం లేదని ఆమె విమర్శించారు. రాజమండ్రిలోని కిమ్స్ ఆసుపత్రిలో గత నెల 23న ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న మెడికల్ విద్యార్థిని అంజలి తల్లిదండ్రులను యాంకర్ శ్యామల,