Tirumala Guest Houses: తిరుమలలో భారీ మార్పు చోటుచేసుకుంది. అత్యధిక విరాళం ఇచ్చి వారి పేరిట భవనాలు నిర్మించిన దాతల పేర్లను టీటీడీ తొలగించింది. దాతల పేర్లను తొలగించి తిరుమల క్షేత్రం.. ఆధ్యాత్మికతకు సంబంధించిన పేర్లను భవనాలకు పెట్టారు. 42 అతిథిగృహల పేర్లను టీటీడీ బోర్డు మార్చివేసింది.