King Cobra Snake Video: 16 అడుగుల భారీ సర్పం అనకాపల్లిలో హల్ చల్ చేసింది. స్థానికంగా దేవర పల్లిలోనిపంట పొలాల్లో గిరినాగు వచ్చింది. దాన్ని చూడగానే కుక్కలు మోరుగుతూ రైతుల్ని అలర్ట్ చేశాయి. వెంటనే రైతులు అక్కడకు వచ్చి గిరినాగును దూరంగా చూస్తు వణికిపోయారు. కోపంతో గిరినాగు రైతుల మీద బుసలు కొడుతూ ముందుకు వెళ్లింది. జనాలు భయంతో దూరంగా పారిపోయారు. ఆ తర్వాత గిరినాగు మరల పొదల్లోకి వెళ్లిపోయింది. అంత పెద్ద గిరినాగును చూడటం ఇదే మొదటిసారి అని రైతులు మాత్రం భయంతో గజ గజ వణికిపోతున్నారు.