Gold Theft In Tirumala: తిరుమలలో దొంగలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన బాపట్లకు చెందిన భక్తుల నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. తిరుమలలోని రాంభగిఛ బస్టాండ్ వద్ద బస్సు ఎక్కుతున్న సమయంలో ముగ్గురు దొంగలు బంగారు గాజులు చోరీ చేశారు. దాదాపు 50 గ్రాముల బంగారు గాజులు చోరీ చేయడంతో భక్తులు లబోదిబోమన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజిలెన్స్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.