Happy Dussehra Wishes Telugu: దసరా పండుగ రోజున జమ్మి వృక్షాన్ని పూజించడం ఆచారం.. పాండవులు తమ అజ్ఞాతవాసం సమయంలో ఆయుధాలను జమ్మి వృక్షం పై దాచి.. తిరిగి విజయం సాధించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దసరా పండగ రోజున జమ్మి వృక్షాన్ని విజయానికి సూచికగా భావించి పూజిస్తారు. అలాగే ఒకరికొకరు జీవితంలో విజయం సాధించాలని జమ్మి చెట్టు ఆకులను పంచుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున అందరూ బాగుండాలని ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.