Manchu Vishnu Bouncers Attack viral video: టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలోని ఆస్తి వివాదం బుధవారం కొత్త మలుపు తిరిగింది. తన ఇంట్లోకి చొరబడి అన్న మంచు విష్ణు కారు తీసుకెళ్లాడని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 1న తాను రాజస్థాన్‌లో ఉండగా విష్ణు తన అనుచరులతో ఇంట్లోకి చొరబడి దాడి చేసి కారు ఎత్తుకెళ్లారని మనోజ్ ఆరోపించారు. అనంతరం మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మనోజ్ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు.