Add Zee Business As A Preferred Source
App

 MS Dhoni Viral Video: MS ధోనీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వేరే లెవల్‌. ధోనీ కనిపిస్తే చాలు ఆయన్ని చుట్టుముట్టి ఆటోగ్రాఫ్స్‌, సెల్ఫీలకు ఎగబడుతుంటారు ఫ్యాన్స్‌. తాజాగా ధోనీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ అభిమాని త‌న బైక్‌పై ధోనీని ఆటోగ్రాఫ్ అడగగా.. ధోని వెంట‌నే బైక్ ముందు పెట్రోల్ ట్యాంక్‌పై త‌న సంత‌కం చేశాడు. ఆ తర్వాత త‌న చేతిపై కూడా ఆటోగ్రాఫ్ కావాలని అడగగా.. మిస్టర్ కూల్ నవ్వుతూ నీకు ఎలా కావాలో చెప్పు.. అలా చేస్తా అంటూ సంతకం చేశాడు. దీంతో ఆ ఫ్యాన్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Recommended Videos