Weather Report: తెలుగు రాష్ట్రాలను వానలు వదిలేలా కనిపించడం లేదు. బంగాళాఖాతంలో అక్టోబరు 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. పశ్చిమ దిశగా కదులుతూ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో రాబోయే వారం మొత్తం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం కేంద్రం ప్రకటించింది.