AP Congress Party: ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన పాలన కొనసాగుతోందని.. ఎన్డీయే పాలన భేష్ అని ప్రధాని మోదీ ప్రశంసించడంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే ఎంపీలతో ఏపీ పాలనపై ప్రశంసలు కురిపించడాన్ని తప్పుబట్టారు. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో షర్మిల విరుచుకుపడ్డారు. పచ్చకామెర్లు సోకినోడి సామెతను ప్రధాని మోదీ గుర్తుకు వస్తోందని ఎద్దేవా చేశారు. పనిగట్టుకొని అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రానా నిజాలు మరుగున పడవని పేర్కొన్నారు.
Also Read: Tirumala: తిరుమల ఆలయానికి అనూహ్య కానుక.. 12 లారీల ఎండుగడ్డి ఇచ్చిన ఎమ్మెల్యే
ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ చేసిన చర్చపై 'ఎక్స్' వేదికగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పందించారు. 'ప్రధాని మోదీ తీరు పచ్చకామెర్లు సోకినోడి సామెతను తలపిస్తోంది. ఏపీలో రైతుల అవస్థలు కనపడవు. గిట్టుబాటు లేక పంటలను తగలబెడుతున్న దృశ్యాలు కనపడవు' అని మండిపడ్డారు. కిలో రూపాయి ధర పెట్టే దారుణాలు కనపడవని.. తుఫాన్ల ధాటికి సర్వం కొల్పోతే ఆదుకోలేని నిర్లక్ష్యం కనిపించదని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల మరణ మృదంగం కనిపించదు. ఫీజు రీయింబర్స్ చెల్లించక విద్యార్థుల కష్టాలు కనిపించవు. ఆరోగ్య శ్రీ ఆపితే రోగుల పడుతున్న రోదన కనపడదు. సూపర్ సిక్స్ హామీల పేరిట చేస్తున్న మోసాలు.. వేస్తున్న కత్తెరలు కనిపించవు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో కూటమి నిర్లక్ష్యం రాస్తే రామాయణం.. వింటే మహాభారతం' అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.
Also Read: Govt Employees: ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. టేక్ హోం శాలరీపై కీలక ప్రకటన
'ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను, విభజన హామీలను మీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టి, తల ఊపమంటే ఊపే గొర్రెల్లా కూటమి పార్టీలు మారాయి కాబట్టే, మోడీకి రాష్ట్రంలో కూటమి పాలన భేష్ అనిపిస్తోంది' అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. సమన్వయంతో పని చేస్తున్నట్లు కనిపిస్తోందా? అని ప్రశ్నించారు. ప్రధాని హోదాలో పనిగట్టుకొని అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రానా నిజాలు మరుగున పడవు అని మోదీని నిలదీశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానిది అసమర్థ పాలన అని చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్భాటాలు, హంగామా తప్పా ఆచరణలో హామీల అమలు శూన్యం అని విమర్శించారు. అభివృద్ధికి ఆమడ దూరం.. రాష్ట్ర ప్రజలపై మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలను అమలు చేయాలని ప్రధాని మోదీని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలని.. ఢిల్లీని మించిన రాజధానిగా అమరావతికి నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు.
Also Read: Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో హైలెట్స్.. రేవంత్ రెడ్డికి భారీ షాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









