)
Vijayawada Utsav 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మైసూర్ దసరా ఉత్సవాల తరహాలో 'విజయవాడ ఉత్సవ్' నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ వేడుకలను సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజులపాటు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీని కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అయితే ఈ ఉత్సవాలు కనివినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. దాదాపుగా 286 ఈవెంట్స్‌తో ఈ వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ కార్నివాల్ ను విజయవాడలో ఏర్పాటు చేయనున్నారు.
అంగరంగ వైభవంగా నిర్వహించనున్న ఈ విజయవాడ ఉత్సవ్ లో ఏకంగా 286 ఈవెంట్స్ తో బిగ్గెస్ట్ కార్నివాల్ కోసం ఏర్పాటు చేయనున్నారు. వీటిలో అగ్రి ఎక్స్ పో నుంచి కూచిపూడి, భరత నాట్యం, డ్రోన్స్ షో ఇలా మరెన్నో ఈవెంట్స్ కనువిందు చేయనున్నాయి. వీటితో పాటు సెపరేట్‌గా ఫుడ్ స్టాల్స్ కూడా ఆహార ప్రియులను అలరించనున్నాయి. దసరా ఉత్సవాలకు విజయవాడలోని దుర్గమ్మ గుడికి వచ్చే వారిని ఇక్కడ ఉంటే విశేషాలను ప్రదర్శిస్తూ పర్యాటకానికి విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.
11 రోజుల పాటు వేడుకలు
దసరా నవరాత్రులు సందర్భంగా విజయవాడ ఉత్సవ్ పేరిట ఆ నగరంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు వేడుకలను నిర్వహించనున్నారు. ఈ 11 రోజుల వేడుకలకు కోసం ఏర్పాట్లు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయి. కృష్ణా నది తీర ప్రాంతంలోని పున్నమీ ఘాట్, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల వంటి ప్రాంతాలను ఈ ఉత్సవాల కోసం ఎంపిక చేశారు. ఇందులో సినీ, సాంస్కృతిక, సంగీత, క్రీడా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. విజయవాడను పర్యాటకంగా సాంస్కృతిక కేంద్రంగా ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ ఉత్సవాలు పెడుతున్నారు.
ఏపీలోని మిగిలిన ప్రాంతాలతో పోల్చితే ఆకర్షణీయమైన టూరిస్ట్ ప్రాంతాలు విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ - విజయవాడ హైవేకు దగ్గరగా ఫెర్రీ ఘాట్, ఫేమస్ కొండపల్లి ఖిల్లా, మూలపాడు నగరం వంటివి ఉన్నాయి. మూలపాడు పార్కు, కొండపల్లి ఖిల్లా, బెరంపార్కు, భవానీ ఐలాండ్ వంటి ప్రదేశాలను కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టూరిస్టు ప్రదేశాలుగా డెవలప్ చేయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook