)
AP Summer Heat Waves: ఆంధ్ర ప్రదేశ్ లో ఎండలు ప్రజల మాడు పగులగొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గత కొన్నేళ్లు రికార్డులను బద్దలు కొడుతున్నాయి. గతంలో కంటే ఈ సారి ఎండ వేడి అమాంతం పెరిగిపోయింది. దీనికి వాతావరణంలో ఎల్‌నినో కూడా ఓ కారణం అని చెబుతున్నారు. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం, పోలవరం, ఏలూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఏపీలో పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. ఈ నెల 25 వరకు అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె ప్రవేశించనుంది. దానికి ముందే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. సోమవారం కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల ఉదయం నుంచి ఎండ తీవ్రత, వడగాడ్పులు వీచాయి. నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe