)
Kurupam Hostel Incident: గురుకుల విద్యార్థుల అరోగ్య పరిస్థితి చూసి షాక్ అయ్యానని.. బిడ్డల శరీరాలు చూస్తే ఏపీ ప్రభుత్వం ఏం భోజనం పెడుతుందో అర్థమైంది. సోమాలియా దేశ పరిస్థితులు గుర్తుకు వచ్చాయి' అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 'నేను ఈ మధ్య గుడితో పాటు బడి ముఖ్యం అని అడిగా. సంక్షేమ వసతిగృహాల్లో కనీస వసతులు లేవని ప్రశ్నించా. నా వ్యాఖ్యలకు మతం రంగు పూసి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఇవ్వాల కురుపాం గురుకులం ఘటన నేను చేసిన డిమాండ్‌కి నిదర్శనం' అని వైఎస్ షర్మిల తెలిపారు. 'మతం మీద మాకు సంస్కారం లేకుంటే.. బిడ్డల ప్రాణాలు తీయడం మీ సంస్కారమా?' అని చంద్రబాబును వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 'స్వర్ణాంధ్ర 2047కాదు.. స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజన్-2027 కావాలి. రెండేళ్లలో సంక్షేమ హాస్టళ్లు బాగు చేయాలి' అని వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు.
కురుపాం గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురవడంతోపాటు ఇద్దరు విద్యార్థినులు మృతి చెందడంపై వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థులు చికిత్స పొందుతున్న కేజీహెచ్ ఆస్పత్రిని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. 'ఆసుపత్రిలో పిల్లల పరిస్థితి చూస్తే షాక్ కి గురయ్యా. వారి ఆరోగ్య పరిస్థితిపై చాలా ఆందోళనగా ఉంది. బిడ్డల ఆరోగ్యం క్షీణించింది. వారి శరీరాలు చూస్తే హాస్టల్లో ప్రభుత్వం ఎలాంటి ఫుడ్ పెడుతుందో అర్థం అవుతోంది' అని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డలను చూస్తే సోమాలియా దేశ పరిస్థితులు గుర్తుకు వచ్చాయని.. గిరిజన హాస్టల్లో కనీసం తారాగడానికి నీళ్లు కూడా ఉండవా? స్నానం చేయడానికి కూడా నీళ్లు ఇవ్వరా అని ప్రశ్నించారు. కలుషిత నీరు తాగి బిడ్డలకు ఈ పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
'ఇద్దరు బిడ్డలు చనిపోవడం చాలా బాధాకరం. కొంతమంది ఐసీయూలో చావు బతుకులతో పోరాటం చేస్తున్నారు. మరొక విద్యార్థిని కూడా చనిపోయినట్లు సమాచారం అందిస్తుంది. హాస్టల్లో ఆర్ఓ సిస్టమ్ పనిచేయడం లేదని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదట. వెల్ఫేర్ హాస్టళ్లు అంటే ప్రభుత్వానికి పట్టింపు లేదు. గిరిజన బిడ్డలంటే ఎవరికి లెక్కలేదు' అని వైఎస్ షర్మిల తెలిపారు. రాష్ట్రంలో ఏ సంక్షేమ హాస్టల్లో కూడా ఆర్ఓ సిస్టమ్ పని చేయడం లేదట.. ఆర్ఓ వాటర్ ప్లాంట్ పని చేస్తేనే వింత.. లేకుంటే కామన్ అని విద్యార్థులు చెప్పారు' షర్మిల పేర్కొన్నారు.
'సొసైటీలో అట్టడుగున ఉన్న వర్గమే ఎస్సీ, ఎస్టీ, బీసీలు. వీరి సంక్షేమంపై ప్రభుత్వానికి బాధ్యత లేకుంటే ఎలా? సరైన సౌకర్యాలు అందుబాటులో ఉంచకపోతే ఎలా? బిడ్డలు చూస్తే నోట్లో నాలుక లేనట్లే ఉన్నారు. ఏ ఇబ్బంది వచ్చినా చెప్పుకోలేరు. ఇటువంటి వారికి ప్రభుత్వం విమర్శించడం దారుణం' అని వైఎస్ షర్మిల తెలిపారు. 'ప్రభుత్వాన్ని నమ్మి హాస్టల్లో వేస్తే ప్రభుత్వం చేసేది ఏంటి? మంచి నీళ్ళు, భోజనం పెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉందా?' అని చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.