)
Palakurthy Politics: అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల నుంచి ఆగ్రహం వస్తే తట్టుకోలేకపోతున్నారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి దిగిపోతున్నారు. వారిని నయానో.. భయానో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. వారిలో మహిళా ప్రజాప్రతినిధులు కూడా తీసిపోలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నారై ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కూడా అదే తరహాలో ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు నియోజకవర్గంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోగా.. మరోసారి రైతులు ప్రశ్నించడంతో మైక్ లాక్కున్నారు. రైతులతో వాగ్వాదానికి దిగారు. ఆమె చేసిన రచ్చ కలకలం రేపింది.
జనగామ జిల్లా దేవరుప్పులలో మంగళవారం రైతు వేదిక వద్ద రాయితీపై విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమంలో పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన అనంతరం రైతులతో మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో పీఎసీఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణ మూర్తి గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై ఎదురుతిరిగారు. తన ప్రసంగంలో భాగంగా రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని.. రైతులకు ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పెద్ది కృష్ణ మూర్తి గౌడ్ హెచ్చరించారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కూడా ఎదిరిస్తా అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలకు విస్తుపోయిన ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే కృష్ణ మూర్తి గౌడ్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
'నువ్వెంత అంటూ' అని కృష్ణమూర్తి గౌడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను నువ్వెంత అని కృష్ణమూర్తి ప్రశ్నించాడు. దీంతో ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగడంతో రైతు వేదిక రసాభాసగా మారింది. ఎమ్మెల్యే తీరుపై పెద్ది కృష్ణ మూర్తి గౌడ్ వర్గానికి చెందిన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం జరిగితే ఎవరైనా ఊరుకునేది లేదని యశస్వినీ రెడ్డికి తేల్చి చెప్పారు. అనంతరం విత్తనాల పంపిణీ సక్రమంగా జరగలేదు. కాగా సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులపైనే యశస్వినీ రెడ్డి దాడి చేయడం కలకలం రేపింది. ఇప్పటికే పాలకుర్తి నియోజకవర్గంలో యశస్వినీ రెడ్డికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలుచోట్ల యశస్వినీ రెడ్డిని నిలదీస్తుండగా.. తాజా పరిణామం కూడా అందులో భాగంగా జరిగింది. మరి కాంగ్రెస్ నాయకుల తిరుగుబాటు భవిష్యత్‌లో పాలకుర్తి రాజకీయాలను మార్చి వేస్తుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి