ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం మొత్తం 5 ఫైల్స్ పై సంతకాలు చేయనున్న సీఎం చంద్రబాబు.
మెగా డీఎస్సీ. 30 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన జనసేన, టీడీపీ.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఎన్నికల ప్రచారంలో ఈ చట్టం హాట్ టాపిక్‌గా మారింది.
రూ.4 వేలకు పింఛన్ పెంపు. ఏప్రిల్ నుంచే పెంచుతామని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించారు.
స్కిల్ సెన్సెక్స్‌పై చంద్రబాబు నాలుగో సంతకం చేయనున్నారు.
అన్న క్యాంటిన్ పునరుద్దీరణ. పేదలకు మధ్యాహ్నం పూట రూ.5కే భోజనం అందించే ఈ పథకాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేయడంతో పునరుద్ధరించాలని నిర్ణయం.
ఐదింటిపై సంతకాలు చేయనుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులు, పింఛన్‌దారులకు లబ్ధి చేకూరనుంది.