రూ.10 లక్షల మద్యం నేలపాలు.. మందుబాబుల ఆవేదన
AP Liquor: ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన వేళ కొందరు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. రూ.10 లక్షల విలువైన మద్యాన్ని నేల పాలు చేశారు. దీంతో మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
AP Liquor: వైఎస్సార్సీపీ నాయకుడికి మద్యం టెండర్ వచ్చిందనే కోపంతో ప్రారంభానికి సిద్ధమైన వైన్ షాపుపై దాడి చేశారు.
AP Liquor: ఈ సంఘటన శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో చోటుచేసుకుంది. పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు.
AP Liquor: ధర్మవరంలో వైఎస్సార్సీపీ నాయకుడు బాల్రెడ్డికి 11100, 7వ నంబర్ మద్యం దుకాణం లాటరీలో వచ్చింది.
AP Liquor: ఇది సహించని ప్రత్యర్థులు మంగళవారం అర్ధరాత్రి దుకాణంపైకి దాడి చేశారు.
AP Liquor: కర్రలతో విరుచుకుపడి దుకాణంలో ఉన్న స్టాక్ మద్యం సీసాలతోపాటు కంప్యూటర్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు.
AP Liquor: సుమారు రూ.10 లక్షల నష్టం జరిగిందని బాధితుడు తెలపగా పోలీసులు విచారణ చేపట్టారు.