ఫామ్ 16 ఎప్పుడొస్తుంది

ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం వచ్చేసింది. ఇప్పుడిక ఉద్యోగులంతా రిటర్న్స్ ఫైల్ చేయాలంటే తప్పనిసరిగా కావల్సిన ఫామ్ 16 కోసం నిరీక్షిస్తున్నారు. మరి ఫామ్ 16 ఎప్పుడొస్తుంది

';

ఐటీ రిటర్న్స్ గడువు

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఇంకా సమయం ఉంది. జూలై 31 చివరి తేదీ. చివరి నిమిషంలో ఇబ్బంది పడే కంటే ముందే సిద్ధమవడం మంచిది.

';

ఫామ్ 16 కీలకం

ఐటీఆర్ కోసం ఫామ్ 16 అనేది తప్పనిసరి డాక్యుమెంట్. ఉద్యోగులకు సంబంధిత సంస్థ జారీ చేస్తుంది. ఇందులో ఆర్దిక సంవత్సరానికి సంబంధించి మీ జీతం, అలవెన్సులు, ఆదాయం వివరాలు పూర్తిగా ఉంటాయి

';

ఫామ్ 16 ఎవరికి

మీ వార్షిక ఆదాయం 2.5 లక్షలు దాటితే మాత్రం తప్పనిసరిగా ఫామ్ 16 జారీ అవుతుంది. ఈ పత్రం ఆధారంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

';

ఫామ్ 16 గడువు తేదీ

ఫామ్ 16 జారీ చేసేందుకు చివరి తేదీ జూన్ 15. ఏప్రిల్ 2023 నుంచి మార్చ్ 2024 వరకూ మీ సంస్థ టీడీఎస్ కట్ చేసినట్టయితే జూన్ 15వ తేదీలోగా ఫామ్ 16 జారీ చేయాల్సి ఉంటుంది.

';

ఐటీ రిటర్న్స్ గడువు తేదీ

ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు జూలై 31 వరకూ గడువుంది. ఆ తరువాత జరిమానాతో కలిపి ఫైల్ చేయాల్సి ఉంటుంది.

';

ఐటీ రిటర్న్స్‌కు ఎన్ని రోజులుంది

జూన్ 15వ తేదీన ఫామ్ 16 జారీ అయిన తరువాత మీకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఇంకా 45 రోజుల సమయం ఉంటుంది.

';

ట్యాక్స్ వెరిఫికేషన్

ఫామ్ 16 ్నేది ఏ ఉద్యోగికైనా చాలా అవసరమైన డాక్యుమెంట్. ప్రభుత్వానికి మీ నుంచి ట్యాక్స్ వసూలవుతుందా లేదా అనేది చెప్పే రుజువు ఇదే.

';

శాలరీ ప్రూఫ్

ఫామ్ 16 అనేది కేవలం ఐటీ రిటర్న్ దాఖలు చేసేందుకే కాకుండా శాలరీ ప్రూప్‌గా కూడా పనిచేస్తుంది. బ్యాంకు సంబంధిత రుణ లావాదేవీల్లో కూడా ఉపయోగపడుతుంది

';

రుణాలు తీసుకునేందుకు

బ్యాంక్, ఆర్ధిక సంస్థల్నించి లోన్ తీసుకోవాలంటే ఫామ్ 16 అడుగుతుంటారు. ఫామ్ 16 ఉంటే ఐటీ రిటర్న్స్ దాఖలు చాలా సులభం. క్షణాల్లో పూర్తవుతుంది.

';

VIEW ALL

Read Next Story