Nirmala Sitharaman: దేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్ర మొరార్జీ దేశాయ్‌కు ఉంది. ఆయన రికార్డును నిర్మల చెరిపేయనున్నారు.
Nirmala Sitharaman: నిర్మల సీతారామన్ ఇప్పటివరకు ఆరు పూర్తి స్థాయి బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. ఒక తాత్కాలిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
Nirmala Sitharaman: 30 మే 2019 నుంచి నిర్మల సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
Nirmala Sitharaman: వరుసగా 2020-21, 2021-22, 2022-23, 2023-24, 2024-25 (రెండు సార్లు: మధ్యంతర బడ్జెట్, పూర్తి స్థాయి బడ్జెట్) బడ్జెట్‌లను నిర్మల ప్రవేశపెట్టారు.
Nirmala Sitharaman: ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్మల సీతారామన్‌కు వరుసగా ఏడో బడ్జెట్.
Nirmala Sitharaman: దేశంలో వరుసగా ఆరు సార్లు (5 పూర్తిస్థాయి+ ఒకటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్) బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్ర మొరార్జీ దేశాయ్‌కు ఉంది.
Nirmala Sitharaman: తాజా బడ్జెట్‌తో మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మల సీతారామన్ తిరగరాశారు.
Nirmala Sitharaman: దేశంలో వరుసగా అత్యధిక కేంద్ర బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మల నిలిచారు.