దీపావళి పండగ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల జీవితంలో ఆనందంతోపాటు శ్రేయస్సు, సంపద లభిస్తుందని భక్తుల నమ్మకం.
ఈ పండగ రోజు చెడుపై మంచి..చీకటిపై వెలుగు సాధించినందుకు గాను దీపాలు వెలిగిస్తారని పురాణాల్లో పేర్కొన్నారు.
శ్రీరాముడు ఇదే రోజు రావణాసురుడి సంహరించి అయోధ్య పట్టణానికి తిరిగి వచ్చినట్టుగాను ఈ దీపావళి పండుగను జరుపుకుంటారని మరికొందరు చెప్పుకుంటారు.
14 ఏళ్ల వనవాసం తర్వాత శ్రీరాముడు పట్టణానికి తిరిగి వచ్చినందుకు గాను అయోధ్య ప్రజలంతా 6 రోజులపాటు దీపావళి పండగను జరుపుకున్నారు.
కొన్ని ప్రాంతాలలో దీపావళి పండగను దీపాల పండుగగా కూడా పిలుస్తారు. ప్రాంతాలు వేరైనా పండగ మాత్రం ఒకేలా జరుపుకుంటారు.
ఈ సంవత్సరం దీపావళి పండగ నవంబర్ 11వ తేదీన వచ్చింది. లక్ష్మీ పూజ చేయాలనుకునేవారు ఉదయం 9 నుంచి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా శుభ సమయమే.
ఆ తర్వాత శుభ సమయం మధ్యాహ్నం 1:24 నుంచి ప్రారంభమై.. మధ్యాహ్నం 2:45 ముగుస్తుంది.
దీపావళి రోజున లక్ష్మీదేవి విగ్రహారాధన చేసేవారు తెల్లవారి రోజున గంగా నదిలో నిమజ్జనం చేయాలి.