బాలీవుడ్ భామలకు ముందు కెరీర్. తరువాతే పెళ్లి, సంసారం ఇతర బాధ్యతలు. అందుకే మాతృత్వం కూడా ఆలస్యమౌతుంటుంది. ఎవరు ఏ వయస్సులో తల్లి అయ్యారో తెలుసుకుందామా...
దీపికా పదుకోన్ బాలీవుడ్ నటి దీపీకా పదుకోన్ 38 ఏళ్ల వయస్సులో ఇప్పుడు గర్భం దాల్చింది. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది
అమృతా రావు మరో బాలీవుడ్ నటి అమృతారావ్ పెళ్లయిన 4 ఏళ్లకు 40 ఏళ్ల వయస్సులో కుమారుడు వీర్‌కు జన్మనిచ్చింది.
ఐశ్వర్యా రాయ్ ఐశ్వర్యా రాయ్ 33 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంది. 4 ఏళ్ల తరువాత అంటే 37 ఏళ్ల వయస్సులో ఆరాధ్యకు జన్మనిచ్చింది
మాధురీ దీక్షిత్ బాలీవుడ్ అగ్ర నటి మాధురీ దీక్షిత్ 37 ఏళ్ల వయస్సులో మొదటి కుమారుడిని 39 ఏళ్ల వయస్సులో రెండవ కుమారుడికి జన్మనిచ్చింది
రాణి ముఖర్జీ రాణి ముఖర్జీ 37 ఏళ్ల వయస్సులో తల్లి అయింది. కుమారుడు ఆదిరాకు జన్మనిచ్చింది.
గుల్ పనాగ్ బాలీవుడ్ నటి గుల్ పనాగ్ పెళ్లయిన ఏడేళ్లకు 39 ఏళ్ల వయస్సులో కుమారుడు నిహాల్‌కు జన్మనిచ్చింది.
దియా మీర్జా బాలీవుడ్ నటి దియా మీర్జా 39 ఏళ్ల వయస్సులో కుమారుడు అవ్యన్‌కు జన్మనిచ్చింది.
బిపాసా బసు బాలీవుడ్ నటి, ప్రముఖ మోడల్ బిపాసా బసు 43 ఏళ్ల వయస్సులో కుమార్తె దేవీకు జన్మనిచ్చింది.
కరీనా కపూర్ కరీనా కపూర్ 36 ఏళ్ల వయస్సులో కుమారుడు తైమూర్, 40 ఏళ్ల వయస్సులో రెండో కుమారుడు జేహ్‌కు జన్మనిచ్చింది.
నేహా ధూపియా నేహా ధూపియా 38 ఏళ్ల వయస్సులో కుమార్తెకు 40 ఏళ్ల వయస్సులో కుమారుడికి జన్మనిచ్చింది.