బాలీవుడ్ హిట్ పెయిర్ ధర్మేంద్ర-హేమమాలిని కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్.
షోలో చిత్రీకరణ సమయంలో ధర్మేంద్ర, హేమా మాలిని మధ్య ప్రేమ చిగురించింది. మరోవైపు అప్పటికే పెళ్లై పిల్లలున్న ధర్మేంద్ర వ్యక్తిత్వానికి పడిపోయిన హేమా మాలిని .. అతనితో కొన్నేళ్లు డేటింగ్ చేసిన తర్వాత 1980లో వీళ్లిద్దరు ప్రేమ వివాహాం చేసుకున్నారు.
బాలీవుడ్ కల్ట్ క్లాసికల్ మూవీస్ లో ‘ది బర్నింగ్ ట్రైన్’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. 1980లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ధర్మేంద్ర, హేమ మాలిని మొదటిసారి 1970లో తుమ్ హసీన్ మై జవాన్ చిత్రీకరణలో కలుసుకున్నారు. ఆ తర్వాత ‘రామ్ ఔర్ శ్యామ్’ నేపథ్యంలో రమేష్ సిప్పీ తెరకెక్కించిన ‘సీతా ఔర్ గీత’లో జోడిగా కనిపించారు.
ధర్మేంద్ర మరియు హేమమాలిని కాంబినేషన్ లో వచ్చిన మరో చిత్రం ‘ఆజాద్’. విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన ఇద్దరు ఎలా ప్రేమలో పడ్డారనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
ధర్మేంద్ర,హేమ మాలిని కాంబోలో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ చిత్రం ‘ప్రతిజ్ఞ’. బందిపోటు దొంగల చేతుల్లో తన తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఓ బిడ్డ.. వాళ్లపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
డ్రీమ్ గర్ల్ సినిమా అనేది ధర్మేంద్ర-హేమమాలిని కాంబినేషన్ లో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ చిత్రం. ఈ సినిమా టైటిలే .. ఆ తర్వాత హేమా మాలిని బిరుదుగా మారింది.
బెంగాలీ నవల కాళిదాస్ నవలా ఆధారంగా బసు ఛటర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.