పిల్లలకు ఎంతో ఇష్టమైన అలానే ఆరోగ్యకరమైన మిల్లెట్ ఇడ్లీ మంచూరియా తయారీ విధానం చూద్దాం..
బియ్యం బదులు వద్దిపప్పుతో మిల్లెట్స్ నానబెట్టుకుని.. ముందుగా మిల్లెట్ ఇడ్లీలు చేసి పెట్టుకోవాలి..
ఒక ఐదు మిల్లెట్ ఇడ్లీలను ముక్కలుగా తరుక్కోవాలి.
స్టవ్ మీద కళాయి పెట్టి నాలుగు స్పూన్ల నూనె వేసుకొని సిమ్ములో పెట్టుకోండి.. అందులో అర స్పూన్ జీలకర్ర, ఆవాలను వేసి వేయించాలి.
అవి చిటపటలాడాక రెండు తరిగిన తర్వాత.. ఒక తరిగిన ఉల్లిపాయ.. నాలుగు తరిగిన పచ్చిమిర్చిలు వేసి కలుపుకోవాలి.
కొద్దిగా చింతపండును మూడు స్పూనుల నీటిలో నానబెట్టుకోవాలి.
నూనెలో వేసినవన్నీ బాగా వేగిన తరువాత చింతపండు పేస్టును వేసి కలుపుకోవాలి.
ఆ తరువాత అర స్పూన్ గరం మసాలా వేసి.. టమాటాలు మెత్తగా ఇగురులాగా అయ్యాక రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న మిల్లెట్ ఇడ్లీ ముక్కలను వేసి కలుపుకోవాలి.
ఇడ్లీలు బాగా పొడిపొడిగా అయ్యేవరకు స్టవ్ మీద ఉంచి తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి.
ఆ తరువాత పైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేస్తే చాలు ఎంతో రుచికరమైన ఇడ్లీ మంచూరియా రెడీ..