అరటి పండ్లు రుచిగా ఉండటమే కాకుండా విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పోషకాలతో నిండి ఉంటాయి. అరటి పండ్లు రోజూ ఎందుకు తినాలో చెప్పే 9 కారణాలివే
అరటి పండ్లు పొటాషియంకు కేరాఫ్ అని చెప్పాలి. అది గుండె, కండరాల పనితీరు సక్రమంగా ఉండేట్టు చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సోడియంపై ప్రభావం చూపించి హైపర్ టెన్షన్ ముప్పును తగ్గిస్తుంది.
ఇందులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రెగ్యులర్ బౌల్ సిండ్రోమ్ సక్రమంగా ఉండేలా చేస్తుంది. మలబద్ధకం దూరం చేస్తుంది. జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది.
అరటి పండ్లు సహజసిద్ధమైన ఇన్‌స్టంట్ ఎనర్జీని అందిస్తాయి. ఇందులోని కార్బోహైడ్రేట్లు ముఖ్యంగా గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఇదుకు దోహదం చేస్తాయి.
అరటి పండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే ఎమైనో యాసిడ్ కీలకమైంది. ఇదే సెరిటోనిన్‌గా మారుతుంది. మూడ్ ఎలివేట్ చేస్తుంది. ఆందోళన, ఒత్తిడి దూరం చేస్తుంది. మానసిక ఆరోగ్యానికి కారణమౌతుంది
పొటాషియంతో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గుండె పోటు ముప్పును తగ్గిస్తుంది
అరటి పండ్లలో విటమిన్లు, మినరల్స్ ముఖ్యంగా విటమిన్ సి, మాంగనీస్ ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. కొలాజెన్ ఉత్పత్తి, ఎముకల పటిష్టత, ఆస్టియోపోరోసిస్ ముప్పు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
ఇందులో ఉండే ఫైబర్ మరీ ముఖ్యంగా పెక్టిన్ రక్తంలో చక్కెర సంగ్రహణను నెమ్మదించేలా చేస్తుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
అరటి పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి విటమిన్ ఇ చర్మానికి చాలా ఉపయోగకరం. హెల్తీ స్కిన్, ఏజీయింగ్ నియంత్రణకు ఉపయోగపడతాయి. స్కిన్ టెక్స్చర్ మెరుగుపడుతుంది.
ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ. దాంతో శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. హెల్తీ స్కిన్, జీర్ణక్రియను మెరుగుపరచడం కోసం దోహదం చేస్తుంది.