రోజు ఇడ్లీ లేదా దోశ తినడం అల్పాహారంలో అత్యంత ఆరోగ్యకరమైన ఆహారం అనే చెప్పాలి. ఇవి తేలికగా జీర్ణమవుతాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తాయి.
ఇడ్లీ, దోశల్లో బాగా ఉడికించిన బియ్యం, పప్పులు ఉంటాయి. ఇవి ప్రొటీన్లు, కర్బోహైడ్రేట్లు, ఫైబర్ సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి తగిన ఎనర్జీని అందిస్తాయి.
ఇవి ప్రోబయాటిక్ లక్షణాలను.. కలిగి ఉండటంతో జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. పులియబెట్టిన ఆహారం కావడంతో, మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
పొద్దున ఈ ఆరోగ్యకరమైన అల్పాహారం.. తింటే శరీరానికి తగిన ప్రొటీన్లను అందించి, ఆకలి నియంత్రణలో ఉండి. బరువు పెరగకుండా నిరోధిస్తుంది.
ఇడ్లీ లేదా దోశల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు తక్కువగా వస్తాయి.
పప్పులో ఉన్న విటమిన్ B, ఖనిజ లవణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, శక్తిని పెంచి శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. అయితే ఈ లాభాలు కోసం మీరు చేయాల్సిందల్లా మితంగా ఇడ్లీ, దోశ తినడం. 3 ఇడ్లీ లేదా రెండు దోశ తింటే పైన చెప్పిన లాభాలను పుష్కలంగా లభిస్తాయి.
పైన చెప్పిన చిట్కాలు.. అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు ఇవ్వబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.