Liver Detox Remedy: లివర్‌లో పేరుకున్న వ్యర్ధాల్ని సమూలంగా తొలగించే ఆకులు..మొత్తం బాడీ డీటాక్స్
వర్షాకాలంలో సాధారణంగా ఫ్రైడ్ పదార్ధాలు, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు, జీర్ణ మసస్యలు ఉత్పన్నమౌతుంటాయి.
చెడు పదార్ధాలు, సీజనల్ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఈ ప్రభావం లివర్‌పై పడుతుంది. లివర్ బలహీనమౌతుంది
శరీరంలో పేరుకున్న విష పదార్ధాలు, వ్యర్ధాలను ఫిల్టర్ చేసి శరీరం నుంచి బయటకు తొలగించే పని లివర్ చేస్తుంది
లివర్ పాడయితే ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతుంది. దీని ప్రభావం శరీరంలోని ఇతర అంగాలపై పడుతుంది
అందుకే లివర్ ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. దీనికోసం రోజూ 2 రకాల ఆకులు తీసుకోవాలి. దీనివల్ల లివర్‌లో పేరుకునే వ్యర్ధాలు సులభంగా తొలగిపోతాయి
లివర్ శుభ్రం చేసేందుకు పుదీనా, తులసి ఆకులు అద్భుతంగా ఉపయోగపడతాయి
చియా సీడ్స్ లివర్ ఆరోగ్యానికి చాలా మంచివి. రెండు చెంచాల చియా సీడ్స్ ఓ గిన్నె నీటిలో నానబెట్టి కొద్ది గంటలు ఉంచాలి
ఇందులో లీటర్ నీళ్లతో పాటు 5-10 తులసి ఆకులు కలపాలి. ఓ గుప్పెడు పుదీనా ఆకులు మిక్స్ చేయాలి. దాంతో పాటు గ్రీన్ ఆపిల్ కట్ చేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2-3 సార్లు సేవించాలి.