Detox Drink: శరీరంలో పేరుకున్న వ్యర్ధాలను నీళ్లలా బయటకు పంపించే అద్భుతమైన డీటాక్స్ డ్రింక్, మలబద్ధకం సైతం దూరం
మసాలా అధికంగా ఉండే పదార్ధాలు, ఫ్రైడ్ పదార్ధాలు లివర్, ప్రేవుల్లో పలు సమస్యలకు కారణమౌతుంది
అందుకే శరీరాన్ని అంతర్గతంగా ఎప్పటికప్పుడు డీటాక్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది
శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు వారంలో రెండు సార్లు ఈ డ్రింక్ తాగితే లివర్‌లో పేరుకునే వ్యర్ధాలు పూర్తిగా బయటికొచ్చేస్తాయి
ఈ డ్రింక్ తయారు చేసేందుకు ఒక లీటర్ నీళ్లు, ఒక గ్రీన్ ఆపిల్, 1-2 చెంచాలు చియా సీడ్స్, గుప్పెడు తులసి, పుదీనా ఆకులు అవసరమౌతాయి
ముందుగా 1 లీటర్ ఫిల్టర్ నీళ్లలో తులసి, పుదీనా ఆకులు వేయాలి. ఇందులో గ్రీన్ ఆపిల్ ముక్కలు, చియా సీడ్స్ వేసి ఓ గంట ఫ్రిజ్‌లో ఉంచాలి
ఓ గంట తరువాత ఫ్రిజ్ నుంచి బయటకు తీసి తాగాలి. వారంలో రెండుసార్లు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య దూరమౌతుంది