అరిటాకుల్లో భోజనం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఎటువంటి రోగాలు దరిచేరకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
అరిటాకు రసాన్ని తాగడం వల్ల రక్తస్రావంతో.. కూడిన విరేచనాలు తగ్గిపోతాయి.
ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు అరటి ఆకులో ఐసు ముక్కను పెట్టి, తలపై మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి త్వరగా తగ్గుతుంది.
అరటి ఆకుల రసాన్ని కషాయం చేసుకొని రోజుకొకసారి తాగితే జ్వరం తగ్గుతుంది. అదే అరటి ఆకుల రసాన్ని చర్మంపై రాస్తే అలర్జీ తగ్గిపోతుంది.
అరటి ఆకుల రసాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి ఆరిన తర్వాత తలస్నానం చేయడం వల్ల చుండ్రు, ఫంగస్ తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా , పొడుగ్గా పెరుగుతుంది.
గర్భం దాల్చిన మహిళలు ఒక ఇంచ్ అరటి ఆకు ప్రతిరోజు తినడం వల్ల పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది.
దోమలు, ఇతర చర్మ సంబంధిత అలర్జీల వల్ల వచ్చే దురదను తగ్గించాలంటే అరటి ఆకు రసాన్ని రాసుకుంటే తగ్గిపోతాయి.