షుగర్ నియంత్రణ చాలా అవసరం..ప్రత్యేకంగా డయాబెటిస్ ఉన్నవారికి.
దాల్చినచెక్క నీటిని రోజూ ఉదయాన్నే తీసుకోవడం ద్వారా.. బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రించవచ్చు.
దాల్చినచెక్కలో యాంటీడయాబెటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిన్న ముక్క దాల్చినచెక్క వేసి బాగా మరిగించి.. ఉదయాన్నే తాగండి.
ఇలా చెయ్యడం ద్వారా ఈ నీరు.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది.
ఈ చిట్కాను పాటించడం ద్వారా షుగర్ సమస్యలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
ఈ సహజమైన చిట్కాను మీ రోజువారీ జీవనశైలిలో చేర్చుకుంటే షుగర్ సమస్యలకి ఇక ముగింపు కాదా?
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.