Nose Problem: మీ ముక్కు చుట్టూ డ్రైగా ఉంటోందా, పొరపాటున కూడా నిర్లక్ష్యం వద్దు
చలికాలం రాగానే చర్మంలై డ్రైనెస్ సమస్య ఉత్పన్నమౌతుంటుంది. డ్రై స్కిన్ అనేది ఒక్కోసారి చలికాలం కారణంగా కాకుండా ఇన్‌ఫెక్షన్ కూడా కారణం కావచ్చు
చాలామందికి ముక్కు, పెదాల కింద డ్రైగా ఉంటుంది. దీనికి చాలా కారణాలుంటాయి. ఆ వివరాలు మీ కోసం
చాలా సార్లు ముక్కు చుట్టుపక్కల డ్రైగా ఉంటుంది. లేదా నల్లగా, ఎర్రగా ఉంటుంది. చర్మం ఊడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా దురద ఎక్కువగా ఉంటుంది
ఈ పరిస్థితిని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. ఇది బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ కావచ్చు
ముక్కు, పెదాల కింద ఆయిలీగా ఉంటుంది ఈ భాగంలో బ్యాక్టీరియా దాడి చేస్తుంది
ఈ బ్యాక్టీరియా ఇరిటేషన్, దురద, రెడ్నెస్‌ను పెంచుతుంది. మీక్కూడా ఈ సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి
ఈ సమస్యను సరి చేసేందుకు యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి మంచి ఫలితాలనిస్తాయి
అయితే వైద్యుని సంప్రదించకుండా ఈ భాగాలపై ఎలాంటి క్రీమ్స్ రాయకూడదు