ఎంతో రుచికరమైన.. అలానే ఆరోగ్యకరమైన.. రాగి ఉప్మా తయారీ విధానం మీకోసం
ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి ఆ తరువాత ఆవాలు వేసి వేయించాలి.
తర్వాత అందులో పప్పులు.. జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి సువాసన వచ్చేవరకు వేయించాలి.
ఆ తర్వాత మళ్లీ ఇంకొంచెం నెయ్యి వేసి సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసి, 1 టీస్పూన్ ఉప్పు చల్లి వేయించుకోవాలి.
అందులోనే 1 కప్పు రవ్వ వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. బాగా వేగిన తర్వాత రాగుల పిండి వేసి మీడియం మంట మీద బాగా వేయించాలి.
తర్వాత అందులో 4 కప్పుల నీళ్లు పోసి తక్కువ మంట మీద ఉంచి.. ఉండలు కట్టకుండా కలపాలి. రవ్వ, రాగి పిండి బాగా వేగితే.. నీరు పోసేటప్పుడు కలిసి ఉండవు.
10 నిమిషాల మూత పెట్టేసి వదిలేయాలి. తర్వాత మళ్లీ మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే ఎంతో రుచికరమైన రాగి ఉప్మా రెడీ.