గుండె ఆరోగ్యం అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. మరి మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో ఎలా తెలుసుకోవడం..దీనికోసం ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి
గుండె చప్పుడు విన్పించినంతవరకే ప్రాణం నిలబడి ఉంటుంది. అందుకే గుండె ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి
కొన్ని వైద్య పరీక్షల ద్వారా గుండె సంబంధిత సమస్యల గురించి తెలుసుకోవచ్చు.
లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష...దీనినే కొలెస్ట్రాల్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. ఈ టెస్ట్ మీ రక్తంలో కొవ్వు ఏ స్థాయిలో ఉందో చెబుతుంది. దీనిద్వారా హార్ట్ ఎటాక్ లేదా గుండె సంబంధిత సమస్యల గురించి తెలుసుకోవచ్చు.
ఈసీజీ..అంటే ఎలక్ట్రో కార్డియోగ్రామ్. గుండె ఎలక్ట్రిక్ యాక్టివిటీ గురించి తెలుస్తుంది.
ఎక్ కార్డియోగ్రామ్...ఈ పరీక్ష ద్వారా గుండె అల్ట్రా సౌండ్ సిద్ధమౌతుంది. దీంతో గుండెలో ఏ చిన్న సమస్య ఉన్నా పసిగట్టవచ్చు
కరోనరీ యాంజియోగ్రామ్....కరోనరీ యాంజియోగ్రామ్ ద్వారా బ్లడ్ వెసెల్స్ సంకోచించాలా లేదా ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది. గుండె కండరాలు లేదా వాల్వ్ లో సమస్య ఉంటే తెలుస్తుంది.
కరోనరీ కంప్యూటెడ్ టోమోగ్రఫీ యాంజియోగ్రామ్...ఇదొక ఇమేజింగ్ టెస్ట్. దీని ద్వారా గుండెకు చేరే రక్త నాళికలను పరీక్షిస్తారు.