మన శరీరానికి పుష్కలంగా ప్రోటీన్ ఇచ్చే ఫుడ్స్ లో ఎగ్ ప్రధానమైనది. మరి అలాంటి కోడిగుడ్డుతో ఎగ్ బైట్స్.. ఎలా చేసుకోవాలో చూద్దాం..
ముందుగా నాలుగు కోడి గుడ్లను.. ఒక గిన్నెలో వేసుకుని బాగా కలుపుకోవాలి.
అందులోనే రెండు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను, రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేయాలి.
తరువాత సన్నగా కట్ చేసుకున్న.. క్యాబేజీ.. సన్నగా తురుముకున్న క్యారెట్ ని కూడా వేసుకోవాలి.
తరువాత రుచికి సరిపడినంత ఉప్పు, కారం, కొత్తిమీర వేసుకొని.. బాగా కలుపుకోవాలి.
తరువాత స్టవ్ మీద..గుంట పొంగనాల బాండీ పెట్టి.. కొద్దిగా నూనె పోయాలి. నూనె కొంచెం కాగిన తర్వాత ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని.. ఒక గరిట సహాయంతో అందులో వేయాలి.
ఒకవైపు బాగా కాగిన తర్వాత.. రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా బాగా వేగిన తర్వాత వాటిని తీసివేయాలి. అంతే టేస్టీ ఎగ్ వైట్ రెడీ