విటమిన్ బి12 డీఎన్ఏ కణాలు, ఎర్రరక్త కణాలను ఉత్పత్తి చేసేందుకు అవసరమైన పోషకం. ఇది ఇమ్యూనిటి వ్యవస్థకు సపోర్టు చేస్తుంది. నరాల పనితీరును కూడా నిర్వహిస్తుంది.
విటమిన్ బి 12 పుష్కలంగా ఉన్న 5 ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని తింటే శరీరానికి విటమిన్ బి12 అందుతుంది.
పాలలో విటమిన్ బి 12 కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పొటాషియం, కాల్షియం, విటమిన్ డికి మంచి మూలం. పాలు తాగడం వల్ల గుండెజబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గిస్తుంది.
గుల్లలలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో జింక్ కూడా ఉంటుంది. ఇమ్యూనిటిని పెంచుతాయి. గాయాలను నయం చేస్తుంది.
మాంసక్రుత్తులతోపాటు గుడ్లలో కూడా విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది. వీటిలో విటమిన్ డి ఉంటుంది.
సాల్మన్ వంటి కొవ్వు చేపలను ఆహారంలో చేర్చుకుంటే ఎంతో మంచిది. ఇందులో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. ప్రొటీన్లు, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
పెరుగులో విటమిన్ బి12 అధిక మొత్తంలో ఉంటుంది. పెరుగు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం ఉన్నాయి. గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏమైనా ఆరోగ్య రుగ్మతలు ఉంటే వెంటనే వైద్యనిపుణుల సలహాను తీసుకోండి.