Pumpkin Benefits: గుండె ఆరోగ్యానికి గుమ్మడికాయ..ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Bhoomi
Oct 17,2024
';

గుమ్మడికాయ

ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఐరన్, ఫైబర్, ఫోలేట్, విటమిన్ సి, యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్లు గుమ్మడికాయలో పుష్కలంగా ఉన్నాయి.

';

పాయసం

గుమ్మడికాయను కూరకానీ పాయసం కానీ చేసుకుని తినవచ్చు. గుమ్మడికాయను డైట్లో చేర్చుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

';

జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి

గుమ్మడికాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సరిగ్గా నిర్వహిస్తుంది.

';

ఎసిడిటి

గుమ్మడికాయను డైట్లో చేర్చుకున్నట్లయితే మలబద్ధకం, ఎసిడిటి, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

';

కళ్లకు మేలు చేస్తుంది

బీటా కెరోటిన్ తోపాటు గుమ్మడికాయలో విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

';

ఎముకలు బలంగా

గుమ్మడికాయలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలకు చాలా ముఖ్యమైంది. కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం అందిస్తుంది.

';

గుండెకు మేలు

గుమ్మడికాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

';

ఊబకాయాన్ని తగ్గిస్తుంది

గుమ్మడికాయలో యాంటీ ఒబెసిటీ లక్షణాలు ఉన్నాయి. బరువును అదుపులో ఉంచుతుంది. మీరు బరువు తగ్గాలంటే గుమ్మడికాయను డైట్లో చేర్చుకోండి.

';

మెరిసే చర్మం కోసం

గుమ్మడికాయలో బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి తోపాటు అనేక ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

';

ఇమ్యూనిటీ

గుమ్మడికాయలో ఉండే లక్షణాలు ఇమ్యూనిటీ వ్యవస్థను బలంగా ఉంచుతుంది. వైరల్ వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story