శరీరంలో బ్లడ్ ప్లేట్‌లెట్స్ తగిన సంఖ్యలో ఉండటం చాలా అవసరం. సరైన పౌష్ఠికాహారం తీసుకోవడం ద్వారా ప్లేట్‌లెట్స్ సంఖ్య పెంచుకోవచ్చు.
ఓట్స్, క్వినోవా వంటి తృణ ధాన్యాల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్ బి వంటి వాటి కారణంగా బ్లడ్ హెల్త్ ఉంటుంది.
గుమ్మడి గింజల్లో జింక్, ఐరన్, విటమిన్ బి9 సమృద్ధిగా ఉంటాయి. ఇవి హెల్తీ బ్లడ్ సెల్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి.
ఆరెంజ్, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్ సి , ఐరన్ కారణంగా శరీరం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
లివర్, కాలేయం వంటి ఆర్గాన్ మీట్‌లో ఐరన్, ఫోలేట్, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్లడ్ సెల్ పనితీరును మెరుగుపరుస్తాయి.
గుడ్లలో ఉండే హై ప్రోటీన్స్, విటమిన్ బి12 కారణంగా ఓవరాల్ బ్లడ్ సెల్ ఉత్పత్తి పెరుగుతుంది.
పాలకూర వంటి ఆకు కూరల్లో ఉండే విటమిన్ కే అనేది ప్లేట్‌లెట్ సంఖ్యను పెంచుతుంది
బీట్‌రూట్‌లో ఉండే ఫోలేట్, నైట్రేట్స్ కారణంగా ప్లేట్‌లెట్స్ ఉత్పత్తి పెరుగుతుంది.
బొప్పాయి ఆకుల రసంతో రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్యను గణనీయంగా పెంచుకోవచ్చు. ఈ విధానం అనాదిగా అమల్లో ఉంది.