Water Intake: ఒక మనిషి తన జీవిత కాలంలో ఎంత నీళ్లు తాగుతాడో తెలిస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం
జీవించేందుకు నీళ్లు చాలా అవసరం. నీళ్లు లేకుండా కొన్ని రోజులు కూడా ఉండలేని పరిస్థితి
ఓ మనిషి శరీరంలో 60 శాతం నీళ్లే ఉంటాయంటే అతిశయోక్తి కానేకాదు
ప్రతి రోజూ కేవలం శ్వాస తీసుకోవడం ద్వారా దాదాపుగా 300 మిల్లీలీటర్ల నీళ్లు ఖర్చవుతాయి
మనిషి తన జీవితకాలంలో 40 వేల లీటర్ల నీళ్లు తాగుతాడంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు
నీళ్లు జీర్ణక్రియకు, విష పదార్ధాలు బయటకు తొలగించేందుకు శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసేందుకు దోహదమౌతుంది
హెల్తీగా ఉండే మనిషి రోజుకు 3 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది.
వేసవిలో, ఎండలో పనిచేసేటప్పుడు రోజుకు 3 లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది
గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు మరింత ఎక్కువ నీళ్లు తాగాలి
జ్వరం, వాంతులు, డయేరియా వంటి సమస్యలున్నప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాలి