కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. భారీ జీతాలతో డబుల్ జాక్పాట్..
Dharmaraju Dhurishetty
Nov 10,2024
';
AICPI ఇండెక్స్ ఆధారంగా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే ఉద్యోగులకు రెండుసార్లు జీతాలు పెరుగుతున్నాయి.
';
DAను కూడా కేంద్ర ప్రభుత్వం AICPI ఇండెక్స్ డేటాను ఆధారంగా తీసుకొని ప్రకటిస్తూ వస్తోంది.
';
ఇదిలా ఉండగా కేంద్రం కింద పని చేసే ప్రతి ఉద్యోగికి వచ్చే సంవత్సరం ఊహించని స్థాయిలో జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
';
అలాగే వచ్చే ఏడాది జనవరి నెలలోనే కేంద్ర ప్రభుత్వం DAను పెంచే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త పే కమిషన్కు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన చర్చలను కూడా కేబినెట్ జరిపింది.
';
ప్రతి ఏడాది ఐదో నెల నుంచి 12వ నెల వరకు AICPI సూచించిన ఇండెక్స్ ఆధారంగానే DA పెంపుపై కీలక నిర్ణయం ఉంటుంది.
';
సెప్టెంబర్ నెల వరకు మొత్తం 143.3 పాయింట్లు కాగా.. ఈ నెలలో 0.07 పైనే పెరిగిందని తెలుస్తోంది.
';
ఇక జూలై విషయానికొస్తే..142.7 పాయింట్లు ఉండగా.. ఆగస్టులో మాత్రం 142.6కి చేరుకుంది.
';
ఈ సంవత్సరం దీపావళికి పెరిగిన డిఏ జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి రాబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది.
';
జులై ఒకటో తేదీ నుంచి DA పెరిగితే.. ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో ఊహించని స్థాయిలో డబ్బులు జమవుతాయి.