ఎప్పుడూ మీరు సెల్ఫీష్ గా ఉంటూ మీ అవసరాలను మాత్రమే తీర్చుకుంటూ పక్కవాళ్లను పట్టించుకోకుండా మంచిది కాదు. దీని వల్ల మీరు ఆ వ్యక్తి నుంచి గౌరవాన్ని కోల్పోవచ్చు.
ఇతర వ్యక్తుల లిమిట్స్ ను పట్టించుకోనట్లయితే..దానిని వారు అగౌరవంగా భావిస్తారు. దీని వల్ల మీరు గౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
మంచి సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఒక వ్యక్తి చాలా విషయాల గురించి సింపుల్ గా ఓపెన్ మైండెడ్ గా ఉండాలి. కొన్ని సందర్బాల్లో స్వంత అభిప్రాయాలను ఎక్కువగా నమ్ముతూ ఉండటం వల్ల ఇతరులకు ఇబ్బంది కలగవచ్చు.
మీరు ఇతరులు చేసే పనినే చేస్తున్నట్లయితే మీకు స్వంతంగా ఆలోచించే సామర్థ్యం లేదని ఇతరులు అనుకుంటారు. దీని వల్ల మిమ్మల్ని ఇతరులను గౌరవించకపోవచ్చు.
చిన్న చిన్న అవసరాలకోసం ఇతరులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల చాలా మంది మిమ్మల్ని ఎగతాళిగా చూస్తారు. అవతలి వ్యక్తికి మీకు బాధ్యత, జవాబుదారీతనం లేదనే ఆలోచనను కలిగిస్తుంది.
మిమ్మల్ని ఇతరులు ఎక్కువగా నమ్మట్లేదంటే మీరు గౌరవాన్ని కోల్పోయినట్లే. ఎక్కువగా అబద్దాలు చెప్పినట్లయితే మీ విశ్వసనీయతను ప్రభావితం చేస్తుంది.
వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఇతరుల ముందు మాట్లాడే వ్యక్తులు ఇతరుల ముందు గౌరవాన్ని కోల్పోవచ్చు.
ఎప్పుడు ఇతరుల ద్రుష్టిని ఆకర్షించాలనే ప్రయత్నాన్ని తగ్గించుకోవడం మంచిది. దీని వలన ఎదుటి వ్యక్తులను నుంచి మీరు గౌరవాన్ని కోల్పోవచ్చు.
మీరు మీ ఇష్టానుసారం ఇతరులతో ప్రవర్తిస్తే..అది మంచి ప్రవర్తనగా పరిగణించరు. గౌరవాన్ని కూడా కోల్పోతారు.