అమ్మాయిలను ఎంతో వెంటాడే భయం మొటిమలు. అయితే ఆ మొటిమలకు పుదీనా ఆకుకు మించిన ఔషధం లేదని మీకు తెలుసా?
మరి పుదీనా ఆకుతో ఫేస్ ప్యాక్ చేసుకొని మొటిమలు ఎలా చిటికలో మాయం చేయాలో చూద్దాం
దోసకాయ, పుదీనా ప్యాక్.. మొటిమల పైన చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఈ ప్యాక్ కోసం అరకప్పు దోసకాయ ముక్కలను..1/4 కప్పు సన్నగా తరిగిన పుదీనా ఆకులను కలిపి మిక్సీ కి వేసి.. పేస్టులా చేసుకుని.. ముఖానికి పట్టించుకోవాలి
20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మెుటిమలు పూర్తిగాపోతాయి. వారం రోజులపాటు ఈ చిట్కాను పాటించండి.
పుదీనా ఆకు పేస్టుని ముల్తానీ మట్టి, కొంచెం రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగిన మీకు మంచి ఫలితం ఉంటుంది.