ఏం భయపడొద్దు... షుగర్ బాధితులు ఈ టిఫిన్లు ఎంచక్కా తినేయొచ్చు
అవకాడో, ఎగ్ టోస్ట్ ఒక సులభమైన ఆహారంతోపాటు సంతృప్తినిచ్చే టిఫిన్. ఈ వంటకం ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లను మిళితం చేసి మిమ్మల్ని శక్తివంతంగా చేస్తుంది.
బెర్రీలు, చీయా విత్తనాలతో పెరుగుతో చేసిన ఈ టిఫిన్ ఎంతో మేలు చేస్తుంది. ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
దాల్చిన చెక్క వోట్మీల్తో పాటు ఆల్మండ్ బటర్ వోట్స్తో చేసే టిఫిన్‌ను మధుమేహ బాధితులు నిస్సందేహంగా తినవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడే టిఫిన్ ఇది. దాల్చిన చెక్కను జోడించడం వల్ల అదనపు రుచి లభిస్తుంది.
బచ్చలికూర ఫెటా ఆమ్లెట్ షుగర్‌ను అమాంతం తగ్గిస్తుంది. అదనపు రుచి, ఫైబర్ కోసం బచ్చలికూర, ఫెటా చీజ్‌తో కూడిన ప్రోటీన్-ప్యాక్డ్ ఆమ్లెట్ ఆరోగ్యానికి చాలా మంచిది.
కొబ్బరి, బాదం, చియా గింజలతో కూడిన చియా పుడ్డింగ్ టిఫిన్ తినండి. ఇది ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చక్కెర స్థాయిల నియంత్రణకు అద్భుతమైన ఎంపిక.
ఈ టిఫిన్ దోసకాయ, హమ్మస్ ర్యాప్ ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన రుచికరమైన అల్పాహారం ఉంటుంది.
చక్కెర స్థాయిలను నియంత్రించే అల్పాహారం బనానా స్మూతీ . ఇది ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. ఇది ఉదయం పూట తక్కువ తిన్నా కూడా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.
వీటిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు. కేవలం అవగాహన సమాచారం కోసం అందిస్తున్నాం. మీ వైద్య నిపుణుల సలహా మేరకు వీటిని తీసుకోవాలి.