ఇక ఈ సంవత్సరం కూడా ఆగస్టు 15.. శని, ఆదివారాలు.. రక్షాబంధన్ కలిపి మొత్తం పైన 5 రోజుల సెలవులు వస్తాయి. మరి ఈ ఐదు రోజులు మనం ఎక్కడెక్కడికి ప్లాన్ చేసుకోవచ్చు చూద్దాం.
వర్షాకాలంలో గోవాకి ఎందుకు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. వర్షాల్లో గోవా బీచ్‌లలో నడవటం.. మీకు ఎంతో మనశ్శాంతిని ఇస్తుంది.
సిక్కిం సౌందర్యం చూడాలి అంటే.. ఆగస్టు నెలలో అక్కడికి పోవాల్సిందే. సహజ సౌందర్యానికే కాదు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి కూడా సిక్కిం ప్రసిద్ది చెందింది.
భూలోకంలో ఉండే స్వర్గం ఉతి అని చెప్పొచ్చు. ఈ హిల్ స్టేషన్ లోని..ప్రకృతి దృశ్యాలు, అందమైన ఉద్యానవనాలు ఈ వర్షాకాలంలో మిమ్మల్ని ఆనంద పరచడం ఖాయం.
కొడైకెనాల్.. ఆగస్టు నెలలో తప్పక చూడాల్సిన ప్రదేశం. కొత్తగా పెళ్లయిన వారికి.. ఈ ప్లేస్.. బెస్ట్ హనీమూన్ ప్లేస్ గా చెప్పుకోవచ్చు.
రాజస్థాన్ లోని ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ప్రదేశం.. ఆగస్టు నెలలో వెళ్లడానికి చాలా సరదాగా ఉంటుంది.