ఆరోగ్య అభిలాషలకు అద్భుతమైన స్నాక్.. పొటాషియం, క్యాల్షియం రిచ్ చిప్స్..
Dharmaraju Dhurishetty
Oct 29,2024
';
ముఖ్యంగా వెయిట్ గైన్ అవ్వాలనుకుంటున్న వారు ఈ అరటికాయ చిప్స్ ను రోజు తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
';
అరటికాయ చిప్స్ తినడం వల్ల పొట్ట కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దీంతోపాటు జీర్ణ క్రియ సమస్యలు కూడా తొలగిపోతాయి.
';
అరటికాయ చిప్స్ తినడం వల్ల గుండె కూడా ఎంతో ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
';
మీరు కూడా ఎప్పటినుంచో అరటికాయ చిప్స్ తినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి.
';
అరటికాయ చిప్స్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం..
';
కావలసిన పదార్థాలు: పచ్చి అరటికాయలు, ఉప్పు, మిర్యాల పొడి, కారం పొడి , నూనె వేయించుకోవడానికి
';
తయారీ విధానం: ముందుగా అరటికాయలను కడిగి ఆరేంతవరకు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. వాటిని చిప్స్ లాగా ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.
';
ఆ తర్వాత ఒక బాటిల్లో ఉప్పు, కారం, మిర్యాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
';
ఆ తర్వాత స్టవ్ పై పెద్ద ముంకుడు పెట్టుకొని అందులో తగినంత నూనెను పోసుకొని బాగా వేడి చేసుకోవాల్సి ఉంటుంది.
';
బాగా వేడి చేసుకున్న నూనెలో అరటికాయ చిప్స్ వేసుకొని దాదాపు రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి.
';
ఇలా వేయించుకున్న ముక్కలపై బాటిల్లో కలిపి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని చల్లి బాగా ఆరనివ్వాల్సి ఉంటుంది. అంతే సులభంగా అరటికాయ చిప్స్ తయారైనట్లే..