నోరూరించే చికెన్ పచ్చడి రెసిపీ.. రుచి వేరే లెవల్..

Dharmaraju Dhurishetty
Aug 11,2024
';

చాలామంది వివిధ రకాల పచ్చళ్ళను తిని ఉంటారు. అందులో చికెన్ పచ్చడిని కూడా తిని ఉంటారు. అయితే దీనిని వివిధ రకాలుగా తయారు చేసుకుంటారు.

';

తెలంగాణలో చికెన్ పచ్చడిని ఒక విధంగా తయారు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా తయారు చేసుకుంటారు.

';

చికెన్ పచ్చడిలో చాలామంది నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే మరికొంతమంది గోంగూరను మిక్స్ చేసి తయారు చేస్తారు.

';

చికెన్ పచ్చడిని ఎలా తయారు చేసినా దాని రుచి వేరే లెవెల్ గా ఉంటుంది. అయితే ఈరోజు ప్రత్యేకమైన చికెన్ పచ్చడి రెసిపీని పరిచయం చేయబోతున్నాం..

';

ఈ ప్రత్యేకమైన చికెన్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో.. దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

';

కావలసిన పదార్థాలు: బోన్‌లెస్ చికెన్: 1/2 కిలో, నూనె: 150 మి.లీ, ఉప్పు: 1/4 కప్పు, మిరప పొడి: 1/4 కప్పు

';

కావలసిన పదార్థాలు: అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్, కరివేపాకు: కొద్దిగా, ఆవాలు: 1 టేబుల్ స్పూన్, జీలకర్ర: 1 టీస్పూన్, మెంతుకు: 1/2 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: దాల్చిన చెక్క: 1 అంగుళం, లవంగాలు: 2, గోరునాలుక: 5-6, కొత్తిమీర: కొద్దిగా, నిమ్మకాయ: 2

';

తయారీ విధానం..చికెన్‌ను ఉడికించడం: బోన్‌లెస్ చికెన్‌ను మెత్తగా ఉడికించి, చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి.

';

వంట నూనె వేడి చేయడం: ఒక మందపాటి బాణలిలో నూనె వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

వంట పదార్థాలు వేయడం: వేడి చేసిన నూనెలో ముందుగా చికెన్ వేసుకొని క్రిస్పీగా వేయించుకోవాలి. వేయించుకున్న చికెన్ ను పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

చికెన్ వేయించుకున్న నూనెలోనే ఆవాలు, జీలకర్ర, మెంతుకు వేసి బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. అల్లం-వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేగించండి.

';

చికెన్ వేసి వేయించడం: ఆ తర్వాత గ్రూపులో చికెన్ ముక్కలు, ఉప్పు, మిరప పొడి వేసి బాగా కలపండి. దాల్చిన చెక్క, లవంగాలు వేసి బాగా కలుపుకోవాలి.

';

నిమ్మరసం వేయడం: చివరగా చికెన్ పికిల్ తయారైన తర్వాత నిమ్మరసం వేసి బాగా కలపండి.

';

ఇలా తయారు చేసుకున్న చికెన్ పచ్చడిని ఒక గ్లాస్ డబ్బాలో వేసుకొని నిల్వ చేసుకోండి.

';

చిట్కాలు: చికెన్ పచ్చడి ఖరాబ్ కాకుండా ఉండడానికి చికెను నూనెలో బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.

';

చికెన్ పచ్చడిలో మీకు కావలసినంత ఉప్పు, మీరం మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story