క్రిస్పీ మొక్కజొన్న వడ రెసిపీ.. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది..
Dharmaraju Dhurishetty
Aug 13,2024
';
లేత మొక్కజొన్నలతో తయారుచేసిన వడలు అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి.
';
మొక్కజొన్నలు ఫైబర్‌తో పాటు పీచు పదార్థాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని వడల్లా తయారు చేసుకొని తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
';
మీరు కూడా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ గా మొక్కజొన్న వడలను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇలా ట్రై చేయండి..
';
మొక్కజొన్న వడలు తయారీ విధానం.. కావలసిన పదార్థాలు.. కావలసిన పదార్థాలు: మొక్కజొన్న పిండి - 1 కప్పు, ఉల్లిపాయ - 1 (తరిగినది), కొత్తిమీర - 1/2 కట్ట (తరిగినది), పచ్చిమిర్చి - 2-3 (తరిగినవి)
';
కావలసిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్, జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్, ధనియాల పొడి - 1/2 టీస్పూన్, మిరపకాయ పొడి - రుచికి సరిపడా, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేయించడానికి
';
తయారీ విధానం: ఒక గిన్నెలో మొక్కజొన్న పిండి, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరపకాయ పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
';
ఆ తర్వాత పై మీ పదార్థాలన్నిటిని మిక్సీలో వేసుకొని బాగా మృదువైన పిండిలా మిక్సీ పట్టుకోవాలి.
';
ఆ తర్వాత ఈ పిండిలో కావలసినంత నీటిని పోసుకొని వడల పిండిలాగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
';
ఇలా తయారు చేసుకున్న పిండిని వేడిగా ఉన్న నూనెలో వేసుకొని గోధుమ రంగులోకి మారేంతవరకు బాగా వేయించుకోవాలి.
';
ఇలా మొక్కజొన్న వడలను రెండు వైపులా బాగా కాల్చుకొని.. మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి.
';
చిట్కాలు: మరింత రుచి కోసం, మీరు పిండిలో కొద్దిగా తరిగిన క్యాప్సికం లేదా క్యారెట్ కూడా చేర్చవచ్చు.
';
వడలను మరింత క్రిస్పీగా చేయడానికి, వాటిని రెండుసార్లు వేయించవచ్చు.